Texas H1B ban : అమెరికాలో హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం 2027 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని నివేదికలు వచ్చాయని అబాట్ పేర్కొన్నారు. అమెరికన్ ఉద్యోగాలు దేశీయ కార్మికులకే దక్కాలని, అది పూర్తిగా అమలయ్యే వరకు కొత్త వీసా పిటిషన్లను ఆపాలని నిర్ణయించామని తెలిపారు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో జరిగే ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రం ఆదర్శంగా ఉండాలన్నారు.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల
కాలిఫోర్నియా, ఫ్లోరిడా తర్వాత ఇదే తరహా నిర్ణయం తీసుకున్న రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజులు భారీగా పెరగడం, సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా స్లాట్లు తగ్గిపోవడంతో విదేశీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: