America Attacks ISIS: సిరియా(Syria) దేశంలో భయంకరమైన ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదుల గురించి తెలియని వారుండరు. కరుడుగట్టిన వీరు ఏమాత్రం కనికరాన్ని చూపించరు. శత్రువులను అత్యంత కిరాతకంగా హతమార్చే ఈ సంస్థ కార్యకలాపాలు బహుభయంకరంగా ఉంటాయి. అందుకే అమెరికా సిరియాలో ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దళాలు దాడులు చేస్తోంది. శుక్రవారం సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికన్ ఫైటర్ జెట్(fighter jet) లు దాడులు ప్రారంభించాయి. సిరియా అంతటా అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి.
Read also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..
డిసెంబర్ 13న పాల్మిరాలో ఇద్దరు అమెరికన్ ఆర్మీ సైనికులు, పౌర అనువాదకుడిని ఐసిసి మూకలు చంపిన తర్వాత అమెరికా ఈ దాడులకు దిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో సిరియాపై అమెరికన్ సైన్యం దాడి చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు, మౌలిక సదుపాయాలపై అమెరికా జెట్ లు దాడులు చేస్తున్నాయి. సిరియా అంతటా అనుమానిత ఆయుధ నిల్వ సౌకర్యాలు, సరఫరా కేంద్రాలు, కార్యచరణ భవనాలు వంటి అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

అమెరికన్ దేశభక్తులను హతమారుస్తున్న ఐసిస్
“సిరియాలో ధైర్యవంతులైన అమెరికన్ దేశభక్తులను ఐసిస్ దారుణంగా హతమార్చిందని.. హంతక ఉగ్రవాదులపై అమెరికా చాలా తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటుందని ఇందుమూలంగా తెలియజేస్తున్నా. సిరియా(Syria)లోని ఐసిస్ బలమైన ప్రాంతాలపై మేము చాలాబలంగా దాడి చేస్తున్నాం. రక్తంతో తడిసిన ఈ ప్రదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఐసిస్ ను నిర్మూలించగలిగితే ఉజ్వల భవిష్యత్తు ఉంది. సిరియాకు గొప్పతనాన్ని తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం.. పూర్తిగా మద్దతు ఇస్తుంది’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘అమెరికన్లపై దాడి చేసేంత దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఇందుమూలంగా హెచ్చరిక జారీచేయబడింది.
మీరు ఏ విధంగానైనా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా, మీరు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా కొట్టబడతారు’ అని ఉగ్రవాద గ్రూపులకు ట్రంప్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ‘డిసెంబర్ 13న సిరియాలోని పాల్మిరాలో అమెరికా ధలాలపై ఐసిసి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని.. ప్రతీకారంగా ఐసిసి స్థావరాలను నిర్మూలించేందుకు ఆమెరికా దళాలు సిరియాలో ఆపరేషన్ హాకీ స్ట్రైక్ ను ప్రారంభించాయి’ అని యుఎస్ యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఎక్స్ లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: