ఈ ఏడాది తొలి పౌర్ణమి సూపర్ మూన్ (Super Moon 2026) (రేపు) శనివారం కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు.. 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. సూపర్ మూన్ (Super Moon 2026) ను చూడటానికి ఇప్పుడు మిస్ అయితే నవంబర్ వరకు ఆగాల్సిందే.చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది. చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది.
Read also: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి
పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు
దీంతో కొన్ని సమయాల్లో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. కొన్ని సమయాల్లో భూమికి దగ్గరగా (పెరిజీ), మరికొన్ని సమయాల్లో దూరంగా (అపోజీ) ఉంటాడు. పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు కనిపించేదే సూపర్‌మూన్‌గా వ్యవరిస్తుంటాం. జనవరి 3న చంద్రుడు భూమికి సుమారుగా 3,56,500 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.దీని వల్ల సాధారణం కన్నా 14శాతం పెద్దగా, 30శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

భూమి, చంద్రుడి మధ్య సరాసరి దూరం సుమారు 3,84,400 కిలోమీటర్లు. పెరీజీ సమయంలో 3,56,500 కిలోమీటర్లు, అపోజీ సమయంలో 4,06,700 కిలోమీటర్లు దూరం ఉంటుంది.2026లో జరిగే సంఘటనకు మరో ప్రత్యేకత ఉంది. ఇది పెరిహెలియన్, అంటే భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే బిందువుతో ఏకీభిస్తుంది. ఈ సమయంలో పెరిజియన్ స్ప్రింగ్ అలలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర అలలు పెద్దవిగా ఉండటం గమనించవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: