ఈరోజు (June11) సాయంత్రం 5:30 గంటలకు జరగాల్సిన స్పేస్ ఎక్స్ (SpaceX ) అంతరిక్ష ప్రయోగం మళ్లీ వాయిదా (Postponed) పడింది. ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ తాజా ప్రకటనలో, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు స్పష్టంచేసింది. ప్రయోగానికి సంబంధించిన కొన్ని కీలక వ్యవస్థల పనితీరును మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
త్వరలో కొత్త తేదీ ప్రకటించనున్న సంస్థ
ప్రయోగానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని స్పేస్ ఎక్స్ ప్రతినిధులు తెలిపారు. తమ ప్రాధాన్యత వ్యోమగాముల సురక్షతేనని స్పష్టం చేశారు. స్పేస్ ఎక్స్ చేపట్టిన ‘Axiom-4’ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి నాలుగు మంది వ్యోమగాములు వెళ్లాల్సి ఉంది. వారు అందరూ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా, సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
భారత వ్యోమగామి శుభాంశుకు అంతర్జాతీయ గుర్తింపు
‘Axiom-4’ మిషన్‌లో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా కీలక పాత్రలో ఉండడం విశేషం. ఆయనతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ మిషన్‌లో భాగమవుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా శుభాంశు రోదసిలో అడుగుపెట్టనున్న తొలి పౌర భారతీయులలో ఒకరుగా గుర్తింపు పొందనున్నారు. ప్రయోగం వాయిదా అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ ప్రయోగం పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : Telangana : తెలంగాణ లో అబ్బాయల కంటే అమ్మాయిలే తక్కువ