అగ్రరాజ్యం అమెరికా(america) పై ప్రకృతి పగబట్టింది. మంచు ప్రళయం ఇప్పుడా ఆ దేశాన్ని వణికిస్తుంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు దాదాపు రెండు వేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను(US winter storm) దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. సుమారు 23 కోట్ల మంది ప్రజలపై ఈ తుఫాను ప్రభావం చూపుతుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే వర్షంకారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయి లక్షలాది ఇళ్లు చీకటిలో మగ్గిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన పలు రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Read Also: Russia: ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు
ఈ మంచు బీభత్సం కారణంగా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలింది. పొగమంచు వల్ల రహదారులు కనిపించక మిచిగాన్ వంటి ప్రాంతాల్లో వందకు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చలిగాలుల ధాటికి ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. బయటకు వస్తే కేవలం పది నిమిషాల్లోనే చర్మం గడ్డకట్టే ప్రమాదం ఉండటంతో చికాగో, డెమాయిన్ వంటి నగరాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఈ తుఫాను ప్రభావం న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ఈశాన్య నగరాలపై మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడ దాదాపు ఒక అడుగు మేర మంచు కురిసే అవకాశం ఉంది. భారీ హిమపాతం కారణంగా చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: