हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sam Altman: ఘిబ్లీ ఇమేజెస్ పై శామ్ ఆల్ట్‌మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Anusha
Sam Altman: ఘిబ్లీ ఇమేజెస్ పై శామ్ ఆల్ట్‌మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇటీవల జిపిటి 4o పేరుతో వెలుగులోకి వచ్చిన కొత్త ఏఐ ఇమేజ్ క్రియేటర్ వెర్షన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ టూల్ ఈజీగా స్టూడియో ఘిబ్లి చిత్రాలను సృష్టిస్తోంది. దీంతో అనేక మంది వారి చిత్రాలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాలు మాములు ఫోటోల మాదిరి కాకుండా యానిమేషన్ గేమింగ్ చిత్రాలను పోలి ఉండటం విశేషం. వీటిని జపాన్ వంటి దేశాలతోపాటు అనేక ప్రాంతాల్లో గేమర్లు, డెవలపర్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ ఫీచర్ గురించి తెలిసిన క్రియేటర్లు అలాంటి చిత్రాలను క్రియేట్ చేయడం మరింత ఈజీ అయ్యిందని చెబుతున్నారు.

యానిమేషన్

ఈ ఆర్ట్ శైలిలో హస్తచిత్రాల నైపుణ్యం, ప్రకృతిని అద్భుతంగా చిత్రీకరించడం,రంగుల సమ్మేళనం ముఖ్యమైనవి. ప్రతీ సన్నివేశం ఒక చిత్రపటంలా కనపడేలా ఉండటం ఘిబ్లీ చిత్రాలకు ప్రత్యేకత. పాత్రల హావభావాలు, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్,ఈ కళాశైలి యానిమేషన్ ప్రేమికులను విపరీతంగా ఆకర్షిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లు అందరూ ఘిబ్లీ ఇమేజెస్ కోసం చాట్‌జీపీటీపై ఒక్కసారిగా పడటంతో దాని సర్వర్ కాస్తా డౌన్ అయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఘిబ్లీ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. దీంతో స్టూడియో ఘిబ్లీ స్టైల్ యానిమేటెడ్ అవతార్ల కోసం యూజర్లు పోటీపడుతున్నారు. వెబ్‌సైట్ల అంతరాయాలను నివేదించే ‘డౌన్‌డిటెక్టర్’ కథనం ప్రకారం ఓపెన్ఏఐకి సంబంధించి ఇప్పటి వరకు 229 ఫిర్యాదులు వచ్చాయి. వారిలో 59 శాతం మంది యూజర్లు చాట్‌జీపీటీపై ఫిర్యాదులు చేశారు. 

ఆస్కార్ అవార్డు

చాట్‌జీపీటీ-4ఓ అప్‌డేట్ ద్వారా ఓపెన్ఏఐ అత్యంత అధునాతన ఇమేజ్ జనరేటర్‌ను తీసుకొచ్చింది. ‘స్పిరిటెడ్ అవే’, ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ వంటి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రాల్లో కనిపించిన మియాజాకి చేతితో గీసిన యానిమేషన్ శైలిలో చిత్రాలను రూపొందించేందుకు యూజర్లకు ఇది అనుమతినిస్తుంది. 

Ghibli Image Trend 1

కరిగిపోతున్నాయి

చాట్‌జీపీటీలో తమ చిత్రాలను చూడటం ప్రజలకు సరదాగా ఉంది కానీ, తమ జీపీయూ (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) కరిగిపోతున్నాయని ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్‌మాన్ సరదాగా వ్యాఖ్యానించారు. దీనిని మరింత సమర్థవంతంగా చేసేందుకు తాత్కాలికంగా కొన్ని ధరల పరిమితులు విధించబోతున్నట్టు చెప్పారు. ఉచిత సేవలు ఎక్కువ రోజులు ఉండవని ఆయన పేర్కొన్నారు.  

ఉచితంగా క్రియేట్

స్టూడియో ఘిబ్లి చిత్రాలను చాట్ జీపీటీ ద్వారా ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ పరిమితులు ఉంటాయి. జీపీటీ ప్లస్, ప్రో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి పూర్తి స్థాయిలో అందుబాటులో రానుంది. ఓపెన్ఏఐ అధికారికంగా చాట్ జీపీటీ వినియోగదారుల కోసంజీపీటీ 4O ఇమేజ్ ఏఐ జనరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ఓపెన్ ఏఐ వీడియో మోడల్, సొర లో కూడా అందుబాటులో ఉంది.జీపీటీ 4o ద్వారా చాట్ జీపీటీ కొత్త ఇమేజ్ జనరేటర్. ఇది ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఘిబ్లి చిత్రాల్లో ప్రకృతి దృశ్యాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల, మీరు సృష్టించాలనుకునే చిత్రంలో పచ్చటి అడవులు, చెర్రీ బ్లాసమ్ చెట్లు వంటి దూర దృశ్యాలు వంటి ప్రకృతి అంశాలను చేర్చుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870