हिन्दी | Epaper

Indian student death USA : అమెరికాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం

Sai Kiran
Indian student death USA : అమెరికాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం

Indian student death USA : అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది. కాలిఫోర్నియాలోని బర్కిలీలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన అతడు మృతిచెందినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆదివారం అధికారికంగా ధ్రువీకరించింది.

ఫిబ్రవరి 12 ఉదయం నుంచి సాకేత్ కనిపించడం లేదని సమాచారం అందడంతో స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లేక్ అంజా సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. అంతకు ముందు ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు.

Read Also: Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

Indian student death USA
Indian student death USA

“భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి మా సానుభూతి,” అని భారత కాన్సులేట్ పేర్కొంది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కుటుంబానికి సహాయం అందిస్తామని తెలిపింది.

సాకేత్‌ను చివరిసారిగా లేక్ అంజా ప్రాంతంలో చూసినట్లు పోలీసులు వెల్లడించారు. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ కోసం 2 రోజుల్లో రూ. 51,400 కోట్లు ఖర్చు చేసిన అమెరికా

ఇరాన్ కోసం 2 రోజుల్లో రూ. 51,400 కోట్లు ఖర్చు చేసిన అమెరికా

ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్‌లో జీతాల కోతలు

ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్‌లో జీతాల కోతలు

10 ఇరాన్ మైన్ లేయింగ్ బోట్లను లేపేసాం – ట్రంప్

10 ఇరాన్ మైన్ లేయింగ్ బోట్లను లేపేసాం – ట్రంప్

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

📢 For Advertisement Booking: 98481 12870