हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Russia: ఉక్రెయిన్ కు రష్యా షరతులు

Vanipushpa
Russia: ఉక్రెయిన్ కు రష్యా షరతులు

మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యా(Russia-Ukraine)ల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే తుర్కియే(Turkey)లోని ఇస్తాంబుల్(Istambul) వేదికగా సోమవారం రెండో విడత చర్చలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా రష్యా పలు కీలక షరతులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తమ షరతులకు అంగీకరిస్తేనే శాంతి ఒప్పందంపై ఆలోచిస్తామని మెలిక పెట్టింది. దీంతో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల చర్చలు గంటలోపే ముగిశాయి. ఈ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని సమాచారం. అయితే, ఖైదీల మార్పిడికి మాత్రం రెండు దేశాలు అంగీకరించడం కొంత ఊరటనిచ్చే అంశం.

Russia: ఉక్రెయిన్ కు రష్యా షరతులు
Russia: ఉక్రెయిన్ కు రష్యా షరతులు

యువ సైనికులను పరస్పరం మార్చుకోవడానికి ఇరుపక్షాల అంగీకారం
ఈ చర్చల్లో భాగంగా, తీవ్రంగా గాయపడిన, అనారోగ్యంతో ఉన్న సైనికులతో పాటు 25 ఏళ్లలోపు వయసున్న యువ సైనికులను పరస్పరం మార్చుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. “ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడికి మేము అంగీకరించాం. ఇరుపక్షాల నుంచి కనీసం 1,000 మంది చొప్పున, బహుశా అంతకంటే ఎక్కువ మందే విడుదల కావచ్చు. ఈ సంఖ్యలను ఖరారు చేస్తున్నాం” అని రష్యా ప్రతినిధి బృందం తెలిపింది. దాదాపు 12,000 సైనికుల మృతదేహాలను కూడా అప్పగించుకోవాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజుల కాల్పుల విరమణకు రష్యా ప్రతిపాదించినా, వివరాలు వెల్లడించలేదు.
షరతులు లేని కాల్పుల విరమణను తిరస్కరించిన రష్యా
మరోవైపు, ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, “తక్షణమే హత్యలు ఆపేందుకు భూమి, సముద్రం, గగనతలంలో కనీసం 30 రోజుల పాటు పూర్తిస్థాయి, షరతులు లేని కాల్పుల విరమణ”కు పట్టుబట్టింది. అయితే, షరతులు లేని కాల్పుల విరమణ డిమాండ్‌ను రష్యా మరోసారి తిరస్కరించిందని ఉమెరోవ్ పేర్కొన్నారు. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రతిపాదనల పూర్తి పాఠాలు అధికారికంగా బయటకు రాలేదు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని దాదాపు 20% భూభాగం రష్యా నియంత్రణలో ఉంది. ఈ చర్చలతో ఇరు దేశాల మధ్య విభేదాలు ఇంకా తీవ్రంగానే ఉన్నాయని స్పష్టమైంది.
రష్యా షరతులు..
ఉక్రెయిన్ లోని మరిన్ని భూభాగాలను తమకు అప్పగించాలి
సైన్యం పరిమాణంపై పరిమితులు విధించుకోవాలి
క్రిమియాతో పాటు మరిన్ని ప్రాంతాలను రష్యా భూభాగంలో కలిపేయాలి
ఉక్రెయిన్ ఏ సైనిక కూటమిలో చేరకూడదు
రష్యన్‌ను అధికార భాషగా గుర్తించాలి
రష్యాపై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయాలి.

Read Also: Ukraine: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870