అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ట్రంప్ తన దూకుడుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా అనేక దేశాలమధ్య ట్రేడ్వార్ నడుస్తున్నది. తాను చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తిస్తున్న ట్రంప్ (Trump) కు రష్యా (Russia) గట్టి హెచ్చరిక చేసింది. రష్యా మీద ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు జలాంతర్గాములను తిరిగి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై రష్యా (Russia) తీవ్రంగా రియాక్ట్ అయింది. అమెరికా భయంతోనే టారీఫ్లను పెంచిందని, ఇప్పుడు జలాంతర్గాములను కూడా అందుకే ఏర్పాటు చేస్తోంది అంటోంది అంటూ రష్యా వ్యాఖ్యలు చేసింది. అయితే జలాంతర్గాముల విషయంలో తాము ఏమీ భయపడడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు.
అమెరికా ఆధిపత్యం క్షీణిస్తోంది: రష్యా
అంతర్జాతీయంగా తమ ఆధిపత్యం క్షీణించడం అమెరికా జీర్ణించుకోలేకపోతోందని రష్యా ఆరోపిస్తోంది. అందుకు తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకే సుంకాలతో దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని వ్యాఖ్యానించింది. అమెరికన్ జలాంతర్గాములు (American Submarines) ఇప్పటికే యుద్ధ విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియే. దీనికి మేం భయపడడం లేదని పెస్కోవ్ అన్నారు. అమెరికా పట్ల రష్యా విదేశాంగ విధానం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు కొనసాగుతుందని పెస్కోవ్ ధృవీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: