మూడున్నర ఏళ్లుగా రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇందులో రెండుదేశాలు ఆర్థికంగా, సైనికపరంగా తీవ్రంగా నష్టపోయాయి. ప్రత్యేకంగా ఉక్రెయిన్ లోని 70శాతం రష్యా(Russia) అధీనంలోకి వెళ్లిపోయింది. ఈరెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా యుద్ధం మాత్రం ఆగిపోవడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) మాత్రం యుద్ధం ఆపేది లేదని స్పష్టం చేశారు. దీనితో ఇరుదేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. సోమవారం అర్థరాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. తమ దేశంలోని జైలుపై రష్యాలకు దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 85 మంది గాయపడ్డారని వెల్లడించారు.

జైలు, కాలనీలపై రష్యా దాడులు
ఉక్రెయిన్లోని జపోర్టియా అనే ప్రాంతంలో ఉన్న జైలుపై రష్యా దాడి చేసింది. బిలెన్కివ్స్యాలోని మరో కాలనీపై కూడా దాడులు చేసింది. ఈ దుర్ఘటనలో 25మంది మృతిచెందారు. మరో 85 మంది గాయపడినట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 42 మంది ఖైదీలకు తీవ్రంగా
గాయాలయ్యాయి. ఇక్కడి భవనాలు ధ్వంసం అయ్యాయి. దాడులతో జైలులోని మిగతా ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని అధికారులు చెప్పారు. ఖైదీలను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం చట్టవిరుద్ధం పౌరులు ఉండే జైళ్లను టార్గెట్ చేసి ఇలా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా ప్రయోగించిన డ్రోన్దాడుల్లో 32 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. ఇదిలా ఉండగా గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దాడులు మరింత ఉద్రిక్తమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ ల మధ్యశాంతిని పునరుద్ధరించేందుకు అ మెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
10-12 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపు
రష్యా-ఉక్రెయిన్తో శాంతి చర్చలకు రావాలని ఇటీవల పుతిన్కు 50రోజుల గడుపు విధించారు. తాజాగా ఆ గడువును కూడా ఆకుదించేశారు. రాబోయే 10-12 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. లేకపోతే రష్యాపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాతో పాటు ఇతర దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు .
ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య సమస్య ఏమిటి?
2014 ఉక్రేనియన్ విప్లవం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతికూలంగా మారాయి, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ నుండి క్రిమియాను స్వాధీనం చేసుకోవడం మరియు డాన్‌బాస్‌లో యుద్ధం జరిగింది.
రష్యా-ఉక్రేనియన్ యుద్ధం అనేది ఫిబ్రవరి 2014లో ప్రారంభమైన కొనసాగుతున్న సంఘర్షణ, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రతో ఇది మరింత తీవ్రమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Doctor negligence: ఎమర్జెన్సీ వార్డులో వైద్యుడి మొద్దునిద్ర.. పేషెంట్ మృతి.. వీడియో వైరల్