గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య యుద్ధం మరింత ఉద్రిక్తలమధ్య కొనసాగేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రవేశపెట్టిన 20 సూత్రాల శాంతి ప్రతిపాదలను రష్యా అంగీకరించినా, ఉక్రెయిన్ మాత్రం దాన్ని త్రోసిపుచ్చింది. దీంతో అమెరికా మధ్యవర్తిత్వపు చర్చలు ఏమాత్రం ఫలించడం లేదు. ఈ సందర్భంగా రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఐరోపా నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పందిపిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోఒకరోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి మద్దతు తెలపకపోతే.. ఉక్రెయిన్ లోని మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని పుతిన్ హెచ్చరించారు. రష్యా రక్షణశాఖ వార్షిక సమావేశాల్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Pakistan: నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు
ఉక్రెయిన్ వైపు దూసుకెళ్తున్న రష్యా దళాలు
రష్యా దళాలు(Russia) అన్నివైపుల నుంచి ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్తున్నాయని పేర్కొన్నారు. దౌత్యం లేదా బలప్రయోగంతోనైనా చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు ఉక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందంపై పురోగతి లేకపోవడంతో పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. యుద్ధం ముగింపు దిశగా యూఎస్ ఇటీవల రష్యాతో పాటు ఉక్రెయిన్, ఐరోపా నేతలపై వేర్వేరుగా చర్చలు కొనసాగించింది. కానీ, శాంతి ఒప్పందంలో భాగంగా తన భూభాగాలు కోల్పోవాల్సి రావడంపై ఉక్రెయిన్ తోపాటు ఇతర యూరోపియన్ దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు మరిన్ని రక్షణలు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పట్టుబడుతున్నారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ తాము మాత్రం తమ ప్రణాళికలతో యథావిధిగా ముందుకు కొనసాగుతామని వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు.వచ్చే ఏడాది మరిన్ని దాడులు: రష్యా రక్షణశాఖ మంత్రి వచ్చే ఏడాది దాడులు తీవ్రత మరింత పెంచుతామని రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రె బెలోసోవ్ అన్నారు. ఈ ఏడాది దేశ డీజీపీలో 5.1శాతం మొత్తాన్ని యుద్ధానికి కేటాయించామని పేర్కొన్నారు. క్రిమియాతో పాటు ఉక్రెయిన్ లో సుమారు 19శాతం భూభాగం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆక్రమించుకున్న భూభాగాలన్ని తమవే అంటూ రష్యా చేసిన ప్రకటనను ఉక్రెయిన్ ఈ వాదనను ఖండించింది. అయితే రెండు దేశాలమధ్య యుద్ధం వల్ల రష్యా చాలావరకు ఉక్రెయిన్ భాగాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: