పాకిస్థాన్ క్రికెట్ (Cricket) చరిత్రలో లెగ్ స్పిన్ మాంత్రికుడిగా పేరొందిన మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సల్మాన్ ఖాదిర్ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళపై అతడు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. లాహోర్‌లోని బార్కీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయింది. సల్మాన్ ను అరెస్ట్ చేసిన పోలీసుల విచారణ చేపట్టారు. సల్మాన్ ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సల్మాన్ తనను బలవంతంగా ఫాంహౌస్‌కు తీసుకెళ్లి బలాత్కారం చేశాడని ఆమె ఆరోపించింది.
Read Also: Delhi: శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ
పాకిస్థాన్ పీనల్ కోడ్ (పీపీసీ) సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సల్మాన్ తనను బెదిరించి, ఫాంహౌస్‌కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో వివరించింది. ఈ ఘటన జనవరి 25న జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు ఫాంహౌస్‌ను సీజ్ చేసి, ఆధారాలు సేకరిస్తున్నారు. అబ్దుల్ ఖాదిర్ పాకిస్థాన్ క్రికెట్‌లో లెగ్ స్పిన్ దిగ్గజంగా పేరొందారు. 67 టెస్టులు, 104 వన్డేలు ఆడి, 236 టెస్ట్ వికెట్లు, 132 వన్డే వికెట్లు పడగొట్టారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో 1992 వరల్డ్ కప్ జట్టులో కీలక సభ్యుడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: