हिन्दी | Epaper

Prince Andrew: బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

Saritha
Prince Andrew: బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?

Prince Andrew: బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ఫైల్స్‌లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బ్రిటన్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈస్టర్న్ ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్‌లో ఉన్న సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని తన నివాసంలో ఆండ్రూను అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. థేమ్స్ వ్యాలీ పోలీస్ విభాగం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నార్ఫోక్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశామని, అయితే జాతీయ మార్గదర్శకాల ప్రకారం పేరు వెల్లడించడం లేదని పేర్కొంది.

కానీ, అరెస్ట్ అయింది ఆండ్రూనేనని బీబీసీ, గార్డియన్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ధృవీకరించాయి.ఆండ్రూ 2010లో బ్రిటన్ వాణిజ్య రాయబారిగా పనిచేసినప్పుడు, జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు అత్యంత రహస్యమైన ప్రభుత్వ వాణిజ్య నివేదికలు, సున్నితమైన పత్రాలు అందించారని ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఫైల్స్‌లో ఆరోపణలు వచ్చాయి.

Read Also: Yoon Suk Yeol: ద‌క్షిణ‌కొరియా మాజీ దేశాధ్య‌క్షుడికి యావర్జీవ కారాగార శిక్ష‌

Prince Andrew: బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్?
Prince Andrew: Former British prince Prince Andrew arrested?

ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

ఈ ఆరోపణల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గతంలో ఎప్‌స్టీన్‌తో తన స్నేహం ఒక పొరపాటని అంగీకరించిన ఆండ్రూ, ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనలేదని గట్టిగా వాదిస్తూ వచ్చారు. బ్రిటన్‌లో ‘పబ్లిక్ ఆఫీస్‌లో మిస్‌కండక్ట్’ అనేది చాలా తీవ్రమైన నేరం. ఈ కేసులో నేరం రుజువైతే జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆండ్రూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్ట్‌పై రాజకుటుంబం నుంచి గానీ, ఆండ్రూ ప్రతినిధుల నుంచి గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

📢 For Advertisement Booking: 98481 12870