Portugal elections 2026 : పోర్చుగల్‌లో నేడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 11 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు కూడా ఈరోజే వెలువడనున్నాయి.
అయితే, ఏ ఒక్క అభ్యర్థి కూడా మొదటి రౌండ్‌లోనే గెలిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలంటే 50 శాతానికి పైగా ఓట్లు సాధించాలి. అది సాధ్యంకాకపోతే, అత్యధిక ఓట్లు సాధించిన టాప్-2 అభ్యర్థులు ఫిబ్రవరి 8న జరిగే రన్‌ఆఫ్ బ్యాలెట్‌లో తలపడనున్నారు.
Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్
ప్రస్తుతం పోర్చుగల్ అధ్యక్షుడిగా Marcelo Rebelo de Sousa గత పది సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే (Portugal elections 2026) అభ్యర్థి ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 11 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి ఉండటం గమనార్హం. ఇప్పటివరకు పోర్చుగల్‌కు మహిళా అధ్యక్షురాలు లేని నేపథ్యంలో, ఈ ఎన్నికలు చరిత్రాత్మకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: