Pope Francis Funeral : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న స్ట్రోక్ తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ఉన్న గ్రాండ్ బరోక్ ప్లాజాలో మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. పోప్ మరణం అనంతరం ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. వాటికన్ ప్రకారం.. శుక్రవారం వరకు 3 రోజుల్లో, దాదాపు 2.5 లక్షల మంది సెయింట్ పీటర్స్ బసిలికాను సందర్శించి పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించారు.

అంత్యక్రియలకు ట్రంప్, ద్రౌపది ముర్ము
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు పోప్ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీగా తుది వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. దాదాపు 2లక్షల మంది సంతాపకులు, 50 మందికి పైగా ప్రపంచ నేతలు తరలి రానున్నారు. పోప్ అంత్యక్రియలకు లక్షలాది మంది తరలివచ్చారు. దాదాపు లక్షా 40వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో 170 దేశాల ప్రతినిధులు ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా హాజరయ్యారు. వీరిలో భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ, బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉన్నారు. సామూహిక నివాళి కార్యక్రమంలో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. ఫిన్‌ల్యాండ్, ఈస్టోనియా దేశాధ్యక్షులు ఆయన పక్కన నిలుచున్నారు.
Read Also: పహల్గాం ఉగ్ర దాడి.. ఎట్టకేలకు స్పందించిన పాక్ ప్రధాని