రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధినేత,కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే ఎన్నటికైనా భారత్‌లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. పీఓకే(POK) భారత్‌లో విలీనం కావాల్సిందేనని,అలా జరగకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మరిన్ని యుద్ధాలు చేయాల్సి వస్తుందని రాందాస్ అథవాలే హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ఆయన భారత సైన్యం ధైర్య సాహసాలు చూపించి పాకిస్తాన్ ఆర్మీకి తగిన గుణపాఠం చెప్పిందని తెలిపారు.పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి పాకిస్తాన్‌ను భారత్ తీవ్రంగా దెబ్బతీసిందని కేంద్రమంత్రి తెలిపారు. కాల్పుల విరమణ కొన్ని రోజులే ఉంటుందని భారత సైనికులు దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పారని వారిని కొనియాడారు. పాకిస్తాన్‌లో తలదాచుకున్న 100 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిందని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మధ్యవర్తిత్వంతో ఈ ఆపరేషన్‌ను ముగించలేదని రాందాస్ అథవాలే తేల్చి చెప్పారు. పీఓకేను భారత్‌కు అప్పగించాలని,ఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలని పాకిస్తాన్ ముందు భారత్ ప్రతిపాదనలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

సమాధానం
ఇక కాశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని రాందాస్ అథవాలే(Ramdas Athawale) తేల్చి చెప్పారు.తూటాకు తూటా సమాధానం చెబుతుందనేది భారత వైఖరి అని పీఓకే భారత్‌లో భాగమని గతంలోనే తాము పార్లమెంటులోనూ చెప్పినట్లు వెల్లడించారు. ఒకవేళ పీఓకేను పాక్ అప్పగించకుంటే తిరిగి భారత్‌లో కలుపుకునేందుకు మనం మరిన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుందని రాందాస్ అథవాలే పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిణామాలను రాజకీయం చేయవద్దని విపక్ష పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.పీఓకేను భారత్‌లో విలీనం చేయాలన్న రాందాస్ అథవాలే వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
Read Also: Foreign Minister: పాకిస్థాన్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉంది: జైశంకర్