‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. మన దేశం నిజమైన బలం ఏంటో శత్రుదేశానికి తెలిసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
Read Also : http://Randhir Jaiswal: 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన శత్రుదేశ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయగలదన్న స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి పంపిందన్నారు. ‘ఎవరైనా మనదేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే.. భారత్ వారి భూభాగంలోకి చొరబడి మరీ దెబ్బకొడుతుందని ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచమంతా చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో పాక్, ఆ ఉగ్రవాదులకు తెలిసింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వ దృఢ వైఖరి సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగానే ఉందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్ ఆశయాలను పూర్తిగా మరిచిపోయిందని ఆరోపించారు.
మోడీ ఎన్నిసార్లు ప్రధాని అయ్యారు?
2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.
మోడీ స్వస్థలం ఏది?
నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ 1950 సెప్టెంబర్ 17న బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత గుజరాత్)లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నేపథ్యం మరియు హిందూ విశ్వాసం కలిగిన గుజరాతీ కుటుంబంలో జన్మించారు.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: