हिन्दी | Epaper

Plane Crashed : రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 49 మంది మృతి

Sudha
Plane Crashed : రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 49 మంది మృతి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం (Plane Crashed) సంభవించింది. ఇవాళ ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Plane Crashed)కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదించింది. అంగారా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఏఎన్-24 ప్యాసింజెర్ విమానం ఇవాళ ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా శివారు ప్రాంతం టైండా పట్టణానికి బయల్దేరింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనంగా.. విమానం అదృశ్యమైంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో కాంటాక్ట్‌ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 49 మంది (Total 49 people) ఉన్నట్లు రాయిటర్స్‌ నివేదించింది. టైండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

 Plane Crashed : రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 49 మంది మృతి
Plane Crashed : రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 49 మంది మృతి

తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. ఆ తర్వాత రెండోసారి ల్యాండింగ్‌ సమయంలో ఈ విమానం ర్యాడార్‌ నుంచి గల్లంతై కూలిపోయినట్లు (Plane Crashed) రాయిటర్స్‌ పేర్కొంది. మరోవైపు ప్రమాద స్థలి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. నివేదికల ప్రకారం.. ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది.

2025 లో ఎన్ని విమానాలు పడిపోయాయి?

జాతీయ రవాణా భద్రతా బోర్డు గణాంకాల ప్రకారం, 2025 లో 94 విమాన ప్రమాదాలు జరిగాయి. జనవరిలో 63 సంఘటనలు మరియు ఫిబ్రవరిలో 31 సంఘటనలు జరిగాయని ఏజెన్సీ బుధవారం నాటికి తెలిపింది.

విమాన ప్రమాదాలకు కారణం ఏమిటి?

విమాన ప్రమాదాలకు పైలట్ తప్పిదం ప్రధాన కారణం. విమానాన్ని నడపడానికి సుదీర్ఘ శిక్షణ, విమానం యొక్క యాంత్రిక భాగాల పరిజ్ఞానం మరియు విమానాన్ని సమర్థవంతంగా మరియు సురక్షితంగా నడపడానికి చేతి-కంటి సమన్వయ నైపుణ్యాలు అవసరం. పైలట్లు కూడా ముందుకు ఆలోచించాలి.

ఎక్కువగా విమాన ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి?

ల్యాండింగ్ సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. విమాన ప్రమాదాలకు ల్యాండింగ్ అనేది అత్యంత సాధారణ విమాన దశ. IATA డేటా ప్రకారం 2005 మరియు 2023 మధ్య జరిగిన అన్ని ప్రమాదాలలో 53% ల్యాండింగ్ దశలోనే జరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: H-1B visa:హెచ్-1బి వీసాదారులపై ఎన్టిఎ మరో దెబ్బ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

📢 For Advertisement Booking: 98481 12870