Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి (Plane Crash) గురైన ఘటనపై పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ సంఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి జైరాజ్‌సింహ్ పర్మార్ (Jairaj Singh Parmar) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రమాదానికి కారణంగా ఎయిర్ ఇండియా నిర్వహణలో ఉన్న లోపాలను ఆయన నిందించారు.

ప్రమాదానికి ముందు నుంచే లోపాలు
జైరాజ్‌సింహ్ పర్మార్ వెల్లడించిన వివరాల ప్రకారం – ప్రమాదానికి మూడు రోజుల ముందు తాను అదే విమానంలో ప్రయాణించానని, అప్పుడే పలు లోపాలను గమనించానని ఆయన తెలిపారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌కు తాను ప్రయాణించిన సమయంలో విమానంలో జీపీఎస్ వ్యవస్థ సరిగా పనిచేయలేదని జైరాజ్‌సింహ్ పర్మార్ పేర్కొన్నారు. అంతేకాకుండా, సీట్లు కూడా దెబ్బతిని ఉన్నాయని, అంతర్గత టెలికం సేవలు అందుబాటులో లేవని, డెస్కులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని ఆయన వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఎయిర్ ఇండియా సేవలు
పర్మార్ వ్యాఖ్యల్లో అంతర్జాతీయ విమానయాన సంస్థలతో పోలిస్తే “ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో అనేక సౌకర్యాలుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ ఎయిర్ ఇండియాలో అవేవీ కనిపించవు. విమానానికి సరైన నిర్వహణ ఉన్నట్టు అనిపించలేదు” అని పర్మార్ అన్నారు. “ఎయిర్ ఇండియా” పేరులో “ఇండియా” అనే పదం ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు మన దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, ఇది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
విమానయాన భద్రత ప్రమాణాలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎయిర్ ఇండియా నిర్వహణను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Read also: Air India Plane Crash : ఫ్లైట్ క్రాష్.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ