हिन्दी | Epaper

America: రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Vanipushpa
America: రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న చివరి క్షణాలు అవి. అంతా నిశబ్ధం.. అంతలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం… అందరిలో కంగారు. ల్యాండ్ అవ్వాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ అవుతుంది. ఏమైందో అని అందరిలోనూ టెన్షన్. అప్పుడే పైలట్ నుంచి ప్రకటన.. విమానం ముందు భాగంలోని టైర్ ఊగిపోయింది అని. అంతే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి! ఒక్క క్షణం తేడా జరిగి ఉంటే భారీ విమాన ప్రమాదమే జరిగేదేమో! అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ (United Airlines)కు చెందిన ఓ విమానం ఆదివారం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి అతి సమీపంగా వెళ్లింది. విమానం రన్‌వేపై దిగుతున్న వేళ ముందు ల్యాండింగ్ గేర్‌కు సంబంధించిన టైరు ఒక్కసారిగా ఊడి పడటంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

Read Also: AP: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. చంద్రబాబు బృందం

America: రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
America: రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు

చికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో పాటు మొత్తం 206 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఈ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం, ఆదివారం ఓర్లాండో చేరుకునే సమయంలో ఈ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. ల్యాండింగ్ సమయంలో ముందు భాగంలో ఉన్న టైరు విడిపోయి రన్‌వేపై పడిపోయినప్పటికీ, అప్రమత్తమైన పైలట్‌ అసాధారణ చాకచక్యంతో విమానాన్ని అదుపులో ఉంచి పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు క్షణకాలం ఉత్కంఠకు గురయ్యారు. అయితే విమానం పూర్తిగా ఆగిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం రన్‌వేపైనే నిలిచిపోవడంతో దానిని తొలగించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఓర్లాండో విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870