Petrol Prices: దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెరదించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి.
Read Also: Pentagon drone strategy : యుద్ధంలో చౌక డ్రోన్ లు , చైనాపై ఆధారపడొద్దని హెచ్చరిక

ముడి చమురు నిల్వలు
ముడి చమురు పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని ప్రభుత్వం వివరించింది. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, దీనివల్ల దేశీయ మార్కెట్లలో ధరల స్థిరత్వం ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఇబ్బందులు ఎదురైనా తట్టుకునేలా భారత్ తగినంత మేర చమురు రిజర్వులను కలిగి ఉందని పేర్కొంది.
హార్ముజ్ జలసంధి సమస్యపై స్పందన
ప్రపంచవ్యాప్తంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్ మరియు ఆయిల్ సరఫరాకు ఏవైనా అంతరాయాలు ఏర్పడినా దేశానికి ఇబ్బంది ఉండదని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళికలతో తగినంత నిల్వలను సిద్ధం చేసుకున్నందున, వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :