ఇరాన్(Iran)పై ఇజ్రాయెల్(Israel) బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో, తమ ఇల్లు మిగులుతుందో లేదో తెలియని అనిశ్చితిలో రాజధాని తెహ్రాన్‌లోని అనేకమంది ట్రాఫిక్‌జామ్స్, పెట్రోల్ బంకు వద్ద క్యూలను దాటి నగరం విడిచిపోతున్నారు. ”నాకు ప్రియమైనవారికి చెందిన జ్ఞాపకాలను, అవసరమైన కొన్ని వస్తువులను ప్యాక్ చేసుకున్నాను. నా మొక్కలకు నీళ్లు పోసి రోడ్డు మీదకి వచ్చాను. ఇకపై తిరిగి వస్తానో, రానో తెలియని ఈ పరిస్థితిలో ఇంటిని విడిచి వెళ్లడం గుండెను బరువెక్కిస్తోంది” అని ఒకరు రాశారు.
ఎప్పటికైనా తిరిగి వస్తామో రాలేమో తెలియదు
”మా ఇంట్లో ఎప్పుడూ ఇంతటి బాధను అనుభవించలేదు. ఎప్పటికైనా తిరిగి వస్తామో రాలేమో తెలియదు” అని మరోకరు రాశారు. ఒక సోషల్ మీడియా(Social Media) యూజర్… కంప్యూటర్, హెడ్‌ఫోన్స్ ఉన్న తన పని ప్రదేశపు ఫోటోను పోస్ట్ చేసి ఇలా రాశారు: “నేను నా సంపాదన కోసం ఎంతో కష్టపడ్డా. నిద్రలేని రాత్రులు, జుట్టు తెల్లబడిపోయేంతలా కష్టపడి సంపాదించిన వస్తువులకు వీడ్కోలు పలికాను. నేను తిరిగి వచ్చినప్పుడు అవి ఇక్కడే ఉంటాయనకుంటున్నాను.” “యూనివర్శిటీలో చదువుకుని, ఇక్కడే పనిచేయానే కలలతో రాజధానికి వచ్చాను” అని కోటిమంది ప్రజలు నివసించే తెహ్రాన్(Tehran)కు ఎందుకు వచ్చింది మరొక యూజర్ రాశారు. “నేను కష్టపడి ప్రేమతో నా ఇంట్లో ఒక్కో వస్తువూ అమర్చాను. అందమైన నాఈ ప్రదేశానికి ఏదో ఒకరోజు తిరిగి రావాలనే ఆశతో మౌనంగా వీడ్కోలు చెప్పాను.” ఆయన అన్నారు. ఇజ్రాయెల్ మొదట్లో అణు కేంద్రాలు, ఉన్నత స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఇప్పుడు నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేస్తోంది. ఇరాన్ విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సోమవారం నాడు ఆదేశించకముందే.. చాలా మంది ప్రజలు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.

స్థానికులకు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు
ఉత్తర తెహ్రాన్‌లోని ఒక పెద్ద ప్రాంతాన్ని, నగరంలోని కొన్ని భాగాలను వెంటనే ఖాళీచేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం స్థానికులను హెచ్చరించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన నాల్గవ రోజున ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 224 మంది మరణించారు. ఇజ్రాయెల్ నగరాలపై తెహ్రాన్ ప్రతీకార క్షిపణి దాడులు చేయగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ మొదట్లో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. కానీ ఆ తర్వాత నివాస ప్రాంతాలతో సహా రాజధానిపై అనేకసార్లు బాంబులు కురిపించింది. ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
వృద్ధ తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, వైద్య అవసరాల కోసం లేదంటే మరోదారిలేక.. అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నామని కొంతమంది నివాసితులు చెప్పారు. మరో మహిళ… తాను ఒంటరిగా ఉన్నానని, 800 కిలోమీటర్లు ప్రయాణించి షిరాజ్‌లోని తన కుటుంబం దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు.
గంటల తరబడి ట్రాఫిక్
తెహ్రాన్ నుంచి బయలుదేరిన స్నేహితులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారని ఆమె అన్నారు. “సాధారణంగా 10-12 గంటలు పట్టే ప్రయాణానికి వారికి 20 గంటలు పట్టింది. బస్సు టిక్కెట్లు కూడా అందుబాటులో లేవు.” అని ఆమె చెప్పారు. “నిజం చెప్పాలంటే, నేను ఎక్కడికో వెళ్ళి, తిరిగి వచ్చి, నాశనమైపోయిన నా జీవితం గురించి ఆలోచించేంత ఓపిక నాకు లేదు. నేను అలిసిపోయాను. ఇన్నేళ్లుగా కోవిడ్, ద్రవ్యోల్బణం ఇలా ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఉన్న స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇదంతా నాశమైపోతుంది అన్నప్పుడు.. ఏం జరిగినా సరే.. నేను, నా పిల్లలు మా ఇంట్లో ఉండడమే నాకిష్టం. ఎందుకంటే మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టే శక్తి నాకు లేదు.” అని ఆమె అన్నారు.
Read Also: Father: ఆ తండ్రి త్యాగం గొప్పది.. బిడ్డల కోసం ప్రాణత్యాగం