జమ్మూకశ్మీర్‌లో పహల్గాం(Pahalgam) ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్(India-Pakistan) మధ్య సంబంధాలు చాలావరకు క్షీణించిన సంగతి తెలిసిందే. అలాగే పాక్(Pak)పై ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ సమయంలో చాలామంది పాక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలపై భారత్‌లో నిషేధించారు. ఈ నిషేధం బుధవారం ఎత్తివేశారు. కానీ మళ్లీ గురువారం ఖాతాలను నిషేధించారు. షాహిద్ అఫ్రిది, హనియా అమీర్ సహా చాలామంది ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నారు.

అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు
బుధవారం కొన్నిగంటల పాటు భారత్‌లో పాకిస్తానీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు కనిపించాయి. కానీ మళ్లి అవి ఇప్పుడు కనిపించడం లేదు. అఫ్రిది, ఫవాద్ కాన్, మహీరా ఖాన్ పేర్లను సెర్చ్ చేసినప్పుడు వాళ్ల అకౌంట్లు భారత్‌లో అందుబాటులో లేదని చూపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వారి ఖాతాలను మళ్లీ నిషేధించినట్లు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బుధవారం కొంతసేపు పాకిస్తానీ సెలబ్రిటీల ఖాతాలు భారత్‌లో చాలా యూజర్లకు కనిపించాయి. అయితే గురువారం నాటికి మళ్లీ అవి నిషేధితంగా మారాయి.
పాకిస్తానీ సెలబ్రిటీల ఖాతాలపై మొదటినుంచి నిషేధం
చిన్నారులు హనియా అమీర్.. సర్దార్ జీ 3 చిత్రంలో భారత నటుడు దిల్జిత్ జోసాంజ్తో కలిసి నటించారు. దీంతో ఈ అంశం వివాదం చెలరేగింది. చివరికి హనియా ఖాతా కూడా భారత్‌లో నిషేధించారు. ఆమెతో పాటు మహీర్ ఖాన్, ఫవాద్ ఖాన్, షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, సబా కమర్, అలీ జాఫర్ లాంటి అనేక మంది పాక్ సెలబ్రిటీల ఖాతాలు భారత్‌లో కనిపించడం లేదు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వతా పాక్ భారత్‌పైకి డ్రోన్లతో దాడులకు యత్నించగా వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాక్‌లోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. చివరికీ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. హనియా అమీర్ ఇటీవల భారత నటుడు దిల్జిత్ దోసాంఝ్ సరసన “సర్దార్ జీ 3” చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఖాతాపై తీవ్ర విమర్శలు, చర్చలు తలెత్తడంతో ఆమె ఖాతాను కూడా నిషేధించారు.
Read Also: Kidnap: మాలిలో భారతీయుల కిడ్నాప్ కలకలం