జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన విధానం, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉందని జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అన్నారు. భారత్‌పై జరిగిన ఈ దాడిని ‘పుల్వామా 2’గా భావించాలని తేల్చిచెప్పారు. “రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేవో యాదృచ్ఛికంగా అన్నమాటలు కావు. ఎందుకంటే ఉగ్రవాదులు పర్యటకుల మతాన్ని అడిగి, ఎవరైతే ముస్లింలు కారో వారిని మాత్రమే చంపారు. హమాస్ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో, భారత్ కూడా అలానే చేయాలి. వాస్తవానికి ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం ప్రారంభించింది. ఎందుకంటే దాడి చేసింది ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్ సైన్యంలోని ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్) కమాండోలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. ఇక మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే.” శేష్ పాల్ వైద్, జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే దాడి
‘బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్, పీఓకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పాకిస్థాన్ సైన్యం చేసిన ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, స్వాతంత్య్రం ప్రకటించుకోండి. అంతేకాదు, పాకిస్థాన్ సైన్యం వెన్నువిరిచి, భారత్ దాన్ని నాలుగు ముక్కలుగా నరకాలి’ అని శేష్ పాల్ వైద్ అన్నారు.
“వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది. పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.
read Also:Pahalgham Terrorist: పహల్గాం ఉగ్రవాది ఫొటో బయటకు.. సోషల్ మీడియాలో వైరల్!