हिन्दी | Epaper

Terror Launchpads : టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను తిరిగి పునర్నిర్మిస్తోన్న పాక్‌!

Sudha
Terror Launchpads : టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను తిరిగి పునర్నిర్మిస్తోన్న పాక్‌!

మే 2025లో భారత ప్రభుత్వం సరిహద్దు పరిధిలోని ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్‌”(Operation Sindoor) లో పాకిస్థాన్‌(Pakistan) లోని టెర్రరిస్ట్ శిబిరాలు, లాంచ్‌ప్యాడ్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి . జూన్ 28, 2025 నేస్తానికే మళ్లీ పాక్‌ వాటినే పునర్నిర్మిస్తోంది. ఇందులో పాక్‌ సైన్యం, ISI, అంతర్గత సర్కారు పాలుపంచుకుని ట్విస్ట్‌తో లాంచ్‌ప్యాడ్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం .పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. భారత్‌ చేపట్టిన ఈ దాడుల్లో ఉగ్రస్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

 Terror Launchpads :  టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను తిరిగి పునర్నిర్మిస్తోన్న పాక్‌!
Terror Launchpads : టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను తిరిగి పునర్నిర్మిస్తోన్న పాక్‌!

శిక్షణా శిబిరాలు
భారత్‌ జరిపిన ఖచ్చితమైన సైనిక దాడుల సమయంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా శిబిరాలను పాకిస్థాన్‌ పునర్నిర్మించడం ప్రారంభించిందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కలిసి ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను, పీఓకేలో ఉగ్రవాదుల కోసం మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నట్టు సమాచారం. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న దట్టమైన అడవుల్లో భారత రాడార్, ఉపగ్రహాలు గుర్తించలేని విధంగా హైటెక్ మినీఉగ్ర శిబిరాలను పాక్ నిర్మిస్తున్నట్లు నిఘా సంస్థలు సూచిస్తున్నాయి.
ఉపగ్రహ నిఘా
లుని, పుట్వాల్‌, తైపు పోస్ట్‌, జమిలా పోస్ట్‌, ఉమ్రాన్వాలి, చాప్రార్‌, ఫార్వర్డ్‌ కహుటా, చోటా చక్‌, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా నిర్మిస్తున్న ఈ శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఫోలేజ్-పెనెట్రేటింగ్ రాడార్, ఉపగ్రహ నిఘాను ఎదుర్కోవడానికి రూపొందించిన అధునాతన సాంకేతికతలు అమర్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్‌ సైన్యం, ఐఎస్‌ఎస్‌ కూడా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 13 లాంచ్‌ ప్యాడ్‌లను తిరిగి అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. కెల్‌, షార్ది, దుధ్నియల్‌, అత్ముకం, జురా, లీపా వ్యాలీ, పచిబన్‌ చమన్‌, తాండ్‌పాని, నయాలి, జన్కోట్‌, చకోటి, నికైల్‌, ఫార్వర్డ్‌ కహుటా వంటి ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.
మినీ క్యాంప్‌
వీటితోపాటు జమ్ము సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న నాలుగు లాంచ్‌ప్యాడ్‌లను ఐఎస్‌ఐ తిరిగి అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. వీటిలో మస్రూర్‌ బడా భాయ్‌, చాప్రార్‌, లూని, షకర్‌గఢ్‌లోని డ్రోన్‌ సెంటర్లు ఉన్నాయి. భారత్‌ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పాక్‌ ఒకే ప్రదేశంలో ఉగ్రవాదులు ఉండకుండా.. పెద్ద శిబిరాలను చిన్నవిగా విభజించినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఏదైనా దాడి జరిగినా నష్టాన్ని నివారించొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి మినీ క్యాంప్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన పాక్‌ ఆర్మీ సిబ్బంది వీటిని పర్యవేక్షించనున్నట్లు సమాచారం.

Read Also:Gaza: గాజాలో ఇజ్రాయెల్ దాడులు ..34 మంది మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

నాటో దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870