పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని స్వయంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్(shahbaz-sharif) అంగీకరించారు. దేశం అప్పుల మీద ఆధారపడి నడుస్తున్న పరిస్థితి తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.పాక్‌కు ఆర్థిక సాయం కోరేందుకు ప్రపంచ దేశాల్లో పర్యటించాల్సి రావడం తనకు సిగ్గుగా ఉందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇలా సహాయం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు.
Read Also: Mine Collapse : ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

నాకు, మునీర్‌కు సిగ్గేస్తోంది..ఆర్మీ చీఫ్‌ను ప్రస్తావించిన ప్రధాని
ఈ విషయంలో తనకే కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కూ సిగ్గుగా అనిపిస్తోందని ప్రధాని స్పష్టంగా చెప్పారు. దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ రుణాలు లేకుండా దేశం నడవలేని స్థితికి చేరడం బాధాకరమని షెహబాజ్ షరీఫ్ అన్నారు. అప్పులు తీసుకొని వాటితో రోజువారీ ఖర్చులు నిర్వహించాల్సిన పరిస్థితి దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రముఖ ఎగుమతిదారులు, వ్యాపారవేత్తల సదస్సులో షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎగుమతులు పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం అత్యవసరమని ఆయన సూచించారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గట్టి ఆర్థిక సంస్కరణలు, అప్పులపై ఆధారాన్ని తగ్గించడం తప్ప మరో మార్గం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: