సొంతదేశ ప్రజలను కాపాడుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, పొరుగు దేశాలపై ఉసిగొలుపుతున్న పాకిస్థాన్ (Economy of Pakistan) ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీంతో పాకిస్థాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలస (టాలెంట్ ఎగ్జోడస్)ను ఎదుర్కొంటున్నది. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కేవలం రెండేళ్లలోనే వేలసంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని బయటపెట్టింది. గత 24నెలల్లో పాకిస్తాన్ నుంచి 5000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది.
Read also: Bangladesh unrest : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత, గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు, రాళ్ల దాడి

Pakistan
ఆసిమ్ మునీర్ పై విమర్శలు
ఈ పరిస్థితి కారణంగా ఆదేశ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ భారీ వలసను ‘బ్రెయిన్ డ్రెయిన్ కాదు, బ్రెయిన్ గైన్’ అని పాజిటివ్ గా చూపించడానికి ప్రయత్నించారు. కానీ గణాంకాలు ఆయన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ నివేదికను మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ ప్రస్తావించారు. రాజకీయాలను సరిదిద్దితేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. పాకిస్థాన్ ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్.
కానీ ఇంటర్నెట్ షట్ డౌన్ లవల్ల 1.62 బిలియన్ డాలర్ల నష్టం జరిగి, 23.7 లక్షల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. వైద్యులు దేశాన్ని విడవటం మరింత ఆందోళన కలిగించింది. ఆరోగ్యరంగం అత్యంతగా దెబ్బతింది. 2011 నుంచి 2024 మధ్యకాలంలో నర్సుల వలన 2,144 శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగిందని పాకిస్థాన్ ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగులు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో వెళ్లిపోవడంతో షెహబాజ్ షరీప్ ప్రభుత్వం విమానాశ్రయాల్లో నియంత్రణలను కఠినతరం చేసింది. 2025లోనే 66,154 మంది ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే నిలిపివేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: