పహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ధాటికి పాాకిస్తాన్ బిత్తరపోయింది. ఎదురుదాడితో భారత్ కు కాస్తో కూస్తో నష్టం చేయగలిగినా పాకిస్తాన్(Pakistan) తీవ్రంగా నష్టపోయింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ చవి చూసిన నష్టాలకు ప్రధాన కారణం భారత్ దాడుల్ని అడ్డుకునే ఆయుధ రక్షణ వ్యవస్ధలు లేకపోవడమే. మరోవైపు భారత్ వద్ద ఇలాంటి అత్యాధునిక వ్యవస్ధలు ఉండటం వల్లే పాక్ దాడుల్ని తిప్పికొట్టగలిగింది. దీంతో ఆపరేషన్ సిందూర్ లో భారత్-పాక్ ల మధ్య తేడా ఈ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్ధలే అని తేలిపోయింది.

తమకూ ఆయుధ రక్షణ వ్యవస్ధల కావాలి
అమెరికాలో పాక్ మంత్రి మాలిక్ దీంతో ఆపరేషన్ సిందూర్ ముగిసి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఇలాంటి గగనతల ఆయుధ రక్షణ వ్యవస్ధలను సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్ ఆపరేషన్ సిందూర్ సమయంలో చేసిన దాడులు, వాడిన ఆయుధాలు, ఆయుధ రక్షణ వ్యవస్ధల గురించి అమెరికా అధికారులతో వివరాలు పంచుకోవడంతో పాటు తమకూ అలాంటి వ్యవస్ధలు కావాలని బతిమాలుకుంటున్నట్లు తెలుస్తోంది.
భారతదేశం ఉపయోగిస్తున్న సాంకేతికత చాలా అభివృద్ధి
అమెరికాలో పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్ దాడుల్ని తిప్పికొట్టే గగనతల దాడుల రక్షణ వ్యవస్ధ కోసం వినతులు ఆపరేషన్ సిందూర్ లో భారత్ చేసిన దాడుల వివరాలూ వెల్లడి భారత్ దాడుల్ని అడ్డుకునే ఆయుధ రక్షణ వ్యవస్ధలివ్వండి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ తమపై 400 క్షిపణులను మోసుకెళ్ళగల 80 యుద్ధ విమానాలతో దాడి చేసిందని, వాటిలో కొన్ని అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళేవి ఉన్నాయని పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అన్నారు. తమ వద్ద గనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేకపోతే తాము శిథిలాలుగా మిగిలిపోయేవాళ్ళమని తెలిపారు. అయితే భారతదేశం ఉపయోగిస్తున్న సాంకేతికత చాలా అభివృద్ధి చెందినదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి దాడుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా తమకూ అలాంటి ఆయుధ వ్యవస్దలు కావాలని అమెరికాను కోరారు.
అమెరికాతో పాకిస్తాన్ బృందం చర్చలు
పాకిస్తాన్ ద్వంద వైఖరి మాలిక్ చేసిన ప్రకటన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తమ దేశంలో చెబుతున్నదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మాలిక్ ఆయుధ రక్షణ వ్యవస్ధల కోసం అమెరికా సహాయం కోరుతుండగా, షరీఫ్ ప్రభుత్వం మాత్రం భారతదేశంతో జరిగిన చివరి పోరులో పాకిస్తానే గెలిచిందని చెబుతోంది. భారత్ భారీగా వైమానిక దాడులు చేయడంతో ఇరుకున పడిన 13 మంది సభ్యుల పాకిస్తాన్ బృందం వాషింగ్టన్లో అమెరికా నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలంటూ బహిరంగంగానే కోరుతోంది. పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అమెరికా తమకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ జెట్లను అమ్మాలని కోరారు. అమెరికాతో పాకిస్తాన్ బృందం చర్చలు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని బృందంలో మాలిక్ కూడా ఉన్నారు.
అమెరికాను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోరిన పాకిస్తాన్
ఈ బృందం ప్రస్తుతం అమెరికా అధికారులు, శాసనకర్తలతో చర్చలు జరపడానికి వాషింగ్టన్లో ఉంది. భారతదేశం యొక్క అత్యాధునిక సాంకేతికత కలిగిన విమానాల నుండి తప్పించుకోవడానికి, తమ వైమానిక స్థావరాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ బృందం అమెరికాను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ జెట్లను ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు ఆపరేషన్ సిందూర్ పై ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. దీంతో పాకిస్తాన్ కూడా అదే బాట పట్టింది. ఇందులో భాగంగా అమెరికా వెళ్లిన పాకిస్తాన్ ప్రతినిధుల బృందం వివరణతో పాటు ఆయుధాలు కూడా కొంటామని చెబుతోంది. దీంతో అమెరికా స్పందన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వాణిజ్యం బూచి చూపి భారత్-పాక్ యుద్ధం ఆపానని ట్రంప్ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కు ఆయుధ రక్షణ వ్యవస్ధలు అమ్మేందుకు ఆయన సిద్దమవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.