పాకిస్తాన్(Pakistan) లో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన దేశాధినేతలపై సైన్యం తిరుగుబాటు చేయడం, వారిపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెట్టడం పరిపాటు. లేదా దేశాధినేతలు(Heads of State) మాజీలుగా మారిన వెంటనే అధికారంలోకి వచ్చిన నేతలు వారిపై కేసులు పెట్టి హింసిస్తుంటారు. బయటికి రాలేని కేసులు పెట్టి జైల్లో హింసిస్తుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇదే. గత రెండేళ్లుగా ఆయన జైల్లో ఉంటున్నా అధికారులకు ఆయనపై దయ పుట్టడం లేదు. పైగా ఆయన సిస్టర్స్ పై కూడా కేసులు పెట్టి, హింసించేందుకు సిద్ధపడుతున్నది ప్రభుత్వం.
Read also: Messi: అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

మొదట ఫ్ ఐఆర్ నమోదు ఆపై టెర్రరిస్ట్ కేసు
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను అవినీతి కేసులో జైలుకు పంపిన ప్రభుత్వం ఆయన సోదరీమణులపై కూడా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ను కలుసుకోవడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన సిస్టర్స్ ఆడియాలా జైలు ముందు ఆందోళన చేయగా పోలీసులు వారిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అడియాలా జైలులో హై ప్రొఫైల్ ఖైదీలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం సెన్సిటివ్ ఏరియాగా, సెక్యూరిటీ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. ఇలాంటి చోట ఇమ్రాన్ సోదరీమణులు బైఠాయించి ఆందోళన చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో ఇమ్రాన్ సోదరీమణులు, పీటీఐ నేతలపై యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: