పాకిస్తాన్ తో భారత్ విదేశాంగ విధానం మారాలని భారతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్(Congress Chairman) సామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మొదట భారత్ పాకిస్తాన్ పై దృష్టి సారించాలని అన్నారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలను సందర్శించిన ప్రతిసారి తనకు సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందని పిట్రోడా అన్నారు. ఈ మూడుదేశాలు కొంతకాలం అలజడి తర్వాత పాలనాపరమైన మార్పులకు లోను కావడం ఆసక్తికరం. హింస, ఉగ్రవాదం వంటి సమస్యలు ఉన్నప్పటికీ పాక్, బంగ్లాదేశ్ తో భారత్ చర్చలు జరపాలని ఆయన సూచించారు.
రాజకీయ దుమారాన్ని రేపుతున్న పిట్రోడా వ్యాఖ్యలు
పాకిస్తాన్ పై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తం రాజకీయ దుమారాన్ని రేపాయి. ‘పాకిస్తాన్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది” అనే వ్యాఖ్యల చేసిన ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘ఈ వ్యాఖ్యలు తీవ్రవాదం, సంఘర్షణలు లేదా భౌగోళిక రాజకీయ సవాళ్లను విస్మరించే ఉద్దేశంతో చేయలేదని ఆయన అన్నారు.

తీవ్రంగా ఖండించిన బీజేపీ
పెట్రోడా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై సామ్ పిట్రోడా బాధ్యాతయుతంగా మాట్లాడారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పట్ల మెతక వైఖరిని కలిగి ఉందని, రాహుల్ గాంధీ దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్(Demand) చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పిట్రోడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం భారత సైనికులను, ప్రజలను అవమానించడమేనని బీజేపీ పార్టీ ఆరోపించింది. అయితే ఈ రాజకీయ విదాదంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు.
సామ్ పిట్రోడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు?
పాకిస్థాన్‌తో సంబంధాలు మరియు భారత్‌లోని పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?
ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: