ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ఈ ఘటనను ఖండిస్తూ, భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: High-speed Rail: ఇతర దేశాలను కలిపే రైల్వే నెట్ వర్క్

భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని
బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు (Netanyahu) . భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: