పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనికులు ధైర్యం, పరాక్రమాన్ని చూపుతూ ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) చేపట్టారు. పాక్, పీఓకే(Pak POK) లోని ఉగ్రస్థావరాలే టార్గెట్గా దాడులు జరిపి వందకుపైగా ముష్కరులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైనికులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయ్యిందని భారత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) విజయాన్ని పిల్లలకు వివరంగా తెలియజేప్పేందుకు రాజస్థాన్ మదర్సా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న మదర్సాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ను సిలబస్లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మదర్సా బోర్డు ఛైర్మన్ చోప్ దార్ వెల్లడించారు.
సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అనుమతులు
రాజస్థాన్ మదర్సా బోర్డు నిర్వహిస్తున్న మదర్సాలలో ‘ఆపరేషన్ సిందూర్’ను సిలబస్ లో చేర్చాలని భావిస్తున్నట్లు చోప్ దార్ వెల్లడించారు. అందుకోసం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాను సైనిక కుటుంబం నుంచి వచ్చానని, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దళాలు చూపిన ధైర్యాన్ని మదర్సాల పిల్లలకు కూడా నేర్పించాలని కోరుకుంటున్నానని అన్నారు.

కర్నల్ సోఫియా ముస్లిం పిల్లలకు ప్రేరణ
“ఆపరేషన్ సిందూర్ గురించి కర్నల్ సోఫియా ఖురేషీ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు, అందరూ ఆమెను చూసి గర్వపడ్డారు. మేము ఆపరేషన్ సిందూర్, కర్నల్ సోఫియా గురించి వీలైనంత ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులకు బోధిస్తాం. అందుకోసం మేము సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో మాట్లాడుతాం. ఆపరేషన్ సిందూర్ ను సిలబస్ లో చేర్చాలని కోరుతాం. ఆతర్వాత పిల్లలకు దీని గురించి తెలియజేస్తాం. కర్నల్ సోఫియా ముస్లిం సమాజానికి చెందిన మహిళ. ఆమె ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు. ఆమె ముస్లిం పిల్లలకు ప్రేరణగా నిలుస్తారు చోప్ దార్, మదర్సా బోర్డు ఛైర్మన్ చెప్పారు.
Read Also: Schengen Visa: ఇండియన్స్ కి షెంజెన్ వీసాల తిరస్కరణ