
భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తన నాలుగురోజులు మూడుదేశాల(Oman) పర్యటనలో భాగంగా ఒమన్లో పర్యటిస్తున్నారు. మస్కట్ లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో మోడీ ప్రసంగించారు. ‘మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్స రాలు పూర్తయ్యాయి. ఇది కేవలం 70 సంవత్సరాల వేడుక మాత్రమే కాదు. ఇది ఒక మైలురాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి’ అని మోడీ ఆకాంక్షించారు.
Read also: Messi: అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం
సముద్రం రెండు చివర్లు చాలా దూరంలో ఉంటాయని అయితే అరేబియా సముద్రం(Oman) మాండవి.. మస్కట్ల మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ వారధి మన సంబంధాలను సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ఈరోజు పూర్తి విశ్వాసంతో చెప్పగలం. సముద్రపు అలలు.. వాతావరణం మారినప్పటికీ భారతదేశం-ఒమన్ మధ్య స్నేహం ప్రతి అలతో పాటు మరింత బలపడుతోంది’ అని మోడీ అన్నారు. జర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడుదేశాల పర్యటన నిమిత్తం మోడీ గత సోమవారం నుంచి పర్యటనలో ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే కావడం విశేషం. భారత్-ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఓ ఎగ్జిబిషన్ ను మోడీ తిలకించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: