ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి వెనుజులా రాజకీయ నాయకురాలు, మానవ హక్కుల కార్యకర్త మరియా కొరినా మచాడో (Maria Corina Machado) ఎంపిక కావడం అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చగా మారింది. ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల రక్షణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న మచాడోను ఎంపిక చేయడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించగా, ఆమె సొంత ప్రభుత్వం మాత్రం ఆగ్రహంతో స్పందించింది.
Read Also: US Passport: బలహీనపడిన యూఎస్ పాస్‌పోర్ట్
ఈ క్రమంలో నార్వే (Norway) లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెనుజులా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎటువంటి కారణాలు లేకుండానే ఎంబసీ మూసివేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే, తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెనుజులా పేర్కొంది.వెనెజులా (Venezuela) తీరుపై నార్వే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది తీవ్ర విచారకరమని నార్వే విదేశాంగ శాఖ పేర్కొంది.
తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ
అంతేకాదు, చాలా అంశాల్లో తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ.. వెనెజులాతో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా తమ దేశం పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వేకు చెందిన స్వతంత్ర నిర్ణయమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు.
వెనెజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటానికి గుర్తింపుగా మారియా మచోడా (Maria Corina Machado) ను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. పన్నెండేళ్లుగా అధ్యక్షుడిగా మదురో కొనసాగుతున్నా.. ఆయన ఎన్నికను అమెరికా సహా పలు దేశాలు గుర్తించలేదు. మచోడా గతేడాదిలో ఎక్కువ కాలం అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చింది.

తనకు వచ్చిన నోబెల్‌ను
ఇక, ఆమెకు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ప్రకటించడంపై మదురో ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే రాయబార కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక, తనకు వచ్చిన నోబెల్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అంకితమిస్తున్నట్లు మారియా మచోడా ప్రకటించారు.
అంతేకాదు, ఈ అవార్డు తన రాజకీయ ఉద్యమానికి ఓ టానిక్ లాంటిందని ఆమె అభిప్రాయపడ్డారు.నోబెల్ అవార్డు రావడం ‘మనం ఒంటరి కాదని గ్రహించడం వల్ల వెనిజులా ప్రజలపై శక్తిని, ఆశను, బలాన్ని నింపుతుంది’ అని అన్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాలోని దౌత్య కార్యాలయాన్ని వెనుజులా మూసివేసి, జింబాబ్వే, బుర్కినో ఫెసోలో రాయబార కార్యాలయాలను తెరిచింది.
ఆధిపత్య ఒత్తిళ్లకు వ్యతిరేకంగా పోరాటంలో వ్యూహాత్మక భాగస్వాములని పేర్కొంది.వాస్తవానికి నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందని అమెరికా అధ్యక్షుడు భావించారు. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, శాంతి బహుమతి అందుకునే అర్హతలు తనకు ఉన్నాయని ట్రంప్ ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: