29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్(Nicholas Pooran)ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ పూరన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.’డియర్ ఫ్యాన్స్ చాలా ఆలోచనలు, పరిశీలనల తర్వాత అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆట నాకెంతో ఇచ్చింది.ఈ ప్రయాణంలో ఎంతో ఆనందం, ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నా. మెరూన్ జెర్సీని ధరించడం, మైదానంలో నిలబడి జాతీయ గీతం ఆలపించడం.జట్టు కోసం సాయశక్తులా కృషి చేయడం,ఇవన్ని నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను. వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించడం ఎప్పటికీ మరిచిపోలేను. అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తాను. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. కష్ట సమయాల్లో అండగా నిలిచారు. నా సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు.
నమ్మకం
నా కుటుంబం, స్నేహితులు, నా సతీమణితో పాటు నా ఈ ప్రయాణంలో నాతో నడిచిన మీకు ధన్యవాదాలు. మీ మద్దతు, నమ్మకం నన్ను నిలబెట్టాయి. నా కెరీర్‌లో అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ వెస్టిండీస్ క్రికెట్(West Indies Cricket)పై నాకున్న ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదు. వెస్టిండీస్ జట్టు మరింత బలంగా మారడంతో పాటు అద్భుతమైన విజయాలు అందుకోవాలని కోరుకుంటా.’అని నికోలస్ పూరన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. నికోలస్ పూరన్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రమే ఆడనున్నాడు.
హాఫ్ సెంచరీలు
పాకిస్థాన్‌తో 2016లో దుబాయ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నికోలస్ పూరన్ 106 మ్యాచ్‌లు ఆడి 2275 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్(England)తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన నికోలస్ పూరన్ 61 మ్యాచ్‌ల్లో 1983 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ ఆడకుండానే నికోలస్ పూరన్ 9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
టాప్ స్కోరర్
2019 వన్డే ప్రపంచ కప్‌లో నికోలస్ పూరన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 9 మ్యాచ్‌ల్లో 367 పరుగులు చేసి విండీస్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో శ్రీలంక(Sri Lanka)పై తొలి సెంచరీ సాధించిన పూరన్ నెదర్లాండ్స్, నేపాల్‌పై మరో రెండు శతకాలు నమోదు చేశాడు. ఈ టోర్నీలో పూరన్ కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనకు ఐసీసీ రైజింగ్ స్టార్ అని పేర్కొంటూ అభినందించింది.
వెస్టిండీస్
టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు (2275) సాధించిన ఆటగాడి పూరన్ నిలిచాడు.ఈ క్రమంలో అతను క్రిస్ గేల్(Chris Gayle) రికార్డును అధిగమించాడు. భారీ సిక్స్‌లు బాదడం తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడం పూరన్ నైజం. 2024 టీ20 ప్రపంచ కప్ 2024లో పూరన్ 113 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.నిక్కీపీ అని ముద్దుగా పిలుచుకునే పూరన్ టీ20ల్లో వెస్టిండీస్‌కు సారథ్యం కూడా వహించాడు. జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండగా పూరన్ రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.
Read Also: MS Dhoni : క్రికెట్ దిగ్గజానికి అరుదైన గౌరవం