हिन्दी | Epaper

ట్రంప్ తో నెతన్యాహు భేటీ

Ramya
ట్రంప్ తో నెతన్యాహు భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భేటీ అయిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ… హమాస్ తో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ మరింత బలంగా మారిందని చెప్పారు. తమ దేశంలో శాంతిని నెలకొల్పడానికి, ప్రజలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడం కోసం గాజాకు సంబంధించి మూడు కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. బందీలను విడుదల చేయడం, హమాస్ సైన్యాన్ని నాశనం చేయడం, తమ దేశానికి గాజా మరోసారి ముప్పు కల్పించకుండా చూసుకోవడం తాము నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలని నెతన్యాహు తెలిపారు.

Trump.jpg

అమెరికాకు ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులలో ట్రంప్ తనకు గొప్ప స్నేహితుడని నెతన్యాహు కొనియాడారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ నేతగా తనను వైట్ హౌస్ కు ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య మైత్రికి ఇది నిదర్శనమని చెప్పారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ట్రంప్ ను అమితంగా ఇష్టపడతారని తెలిపారు.
యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ తన పరిధిని దాటి ప్రయత్నిస్తున్నారని నెతన్యాహు అన్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు, ట్రంప్ మాట్లాడుతూ గాజా స్ట్రిప్ ను స్వాధీనం చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

ప్ర‌ధాని మోదీ వెళ్లిపోగానే..ఇరాన్‌పై దాడి

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

భారత్‌కు హార్డ్ రాక్ గుడ్ బై!

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

పారిస్‌లో అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: ట్రంప్-జి సమ్మిట్‌కు రంగం సిద్ధం!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. రాకపోకలు నిలిపివేత

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

ఎన్నిరోజులైనా పొరాడేందుకైనా మేం సిద్ధం

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

తన మరణవార్తలపై నెతన్యాహు సెటైర్లు.. కొత్త వీడియోతో పుకార్లకు చెక్!

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

📢 For Advertisement Booking: 98481 12870