Nepal Elections 2026: నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతం జరిగింది. ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా (35), నాలుగు సార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ ఓలీని మట్టికరిపించారు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న బాలేంద్ర షా, సీనియర్ నేతకు చుక్కలు చూపించి భారీ విజయాన్ని నమోదు చేశారు.ఝాపా-5 నియోజకవర్గంలో ఓలీని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేసిన బాలేంద్ర షా 50 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. బాలేంద్ర షా 68,348 ఓట్లు సాధించగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు వచ్చాయి.
Read Also: Donald Trump: ఖరీదైన రాకెట్ల కంటే నౌకలే మేలు: ట్రంప్
ర్యాపర్ టు ఇంజినీర్.. ఖాట్మాండ్ మేయర్ టు ఎంపీ!
నేపాల్‌లో గురువారం ఎన్నికలు జరగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు మొదలైంది.బాలేంద్ర షా 2022లో ఖాట్మాండ్ మేయర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. బాలేంద్ర షాను బాలెన్‌గా పిలుస్తుంటారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఆయన ర్యాప్ గాయకుడు కూడా కావడం గమనార్హం. ఆయన యూట్యూబ్ ఛానల్‌కు పది లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఇప్పుడు నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఆర్ఎస్పీ 25 సీట్లలో గెలిచి 93 సీట్లలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 4 సీట్లలో గెలిచి 11 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు 40 సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: