हिन्दी | Epaper

Iran: ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

Vanipushpa
Iran: ఖమేనీ వారసుడిగా రెండో కుమారుడు మొజ్తబా ఎన్నిక

ఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్‌ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త నేతగా ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై అమెరికా, ఇరాన్‌ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్‌లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడుల కారణంగా వెలువడుతున్న పొగలు పర్యావరణానికి పెను ముప్పు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక కొలిక్కివచ్చింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తబా(Mojtaba) ను ఎన్నుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో అత్యంత రహస్య వ్యక్తిగా పేరొందిన మొజ్తబా ఖమేనీ, ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్స్ ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాయి. మోజ్తబా ఇప్పటివరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టలేదు.

Read Also: Yadadri Bhuvanagiri crime: పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

Iran: Khamenei's second son Mojtaba elected as successor
Iran: Khamenei’s second son Mojtaba elected as successor

ఇరాన్​ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలి

ఇరాన్​ సుప్రీం లీడర్​గా మొజ్తబా ఖమేనీ ఎన్నిక కావడం పట్ల ఆ దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. అనేక మంది మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1969లో మషాద్ నగరంలో జన్మించిన మొజ్తబా, చిన్నతనం నుంచే తన తండ్రి షా పాలనను చూస్తూ పెరిగారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో రివల్యూషనరీ గార్డ్స్ తరపున పోరాడారు. 1989లో తన తండ్రి అయాతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్‌ అయిన తర్వాత, మొజ్తబా క్రమంగా తన పట్టును పెంచుకున్నారు. 2008 నాటి వికీలీక్స్ పత్రాలు ఆయన్ను తెర వెనుక అసలు అధికారిగా అభివర్ణించాయి. 2005, 2009 ఎన్నికల్లో అహ్మదీ నెజాద్ గెలుపులో మొజ్తబా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్‌ నాయకత్వంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇరాన్​ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలని, లేకపోతే వారు ఎక్కువ కాలం కొనసాగలేరని ట్రంప్​ హెచ్చరించారు. మొజ్తాబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశం ద్వారా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇరాన్‌ను నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్న ఆయన, ఇరాన్ ప్రజలు తిరగబడితే ఇరు దేశాలు మళ్లీ మంచి మిత్రులుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని పిలుపునిచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870