हिन्दी | Epaper

Mock Drills: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్‌ డ్రిల్స్‌

Vanipushpa
Mock Drills: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్‌ డ్రిల్స్‌

భారత్‌, పాకిస్థాన్‌(Bharath-Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్‌ డ్రిల్స్‌ (Mock Drills) నిర్వహించనున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ‘ఆపరేషన్‌ షీల్డ్‌’ (Operation Shield) పేరుతో పాక్‌ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌, చండీగఢ్‌, జమ్ము కశ్మీర్‌లో మాక్‌ డ్రిల్స్‌ జరగనున్నాయి.

రాజస్థాన్‌లోని 41 జిల్లాల్లో ఈ డ్రిల్స్‌
ఇందులో భాగంగా హర్యానాలో రాత్రి 8 గంటల నుంచి 8:15 వరకూ బ్లాక్‌ అవుట్‌ నిర్వహించనున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి సైరన్ మోగించనున్నారు. ఇక రాజస్థాన్‌లోని 41 జిల్లాల్లో ఈ డ్రిల్స్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోనూ నివాస ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌ నిర్వహించనున్నారు. అయితే, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని అక్కడి అధికారులు చెప్పారు. ఆ సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వైమానిక దాడి సైరన్‌లు మోగించనున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఆపరేషన్‌ షీల్డ్ మాక్‌ డ్రిల్స్‌ నిజానికి ఈ నెల 29నే నిర్వహించాల్సి ఉంది. పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్‌ డ్రిల్స్‌ వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఈ డ్రిల్స్‌ను నిర్వహిస్తున్నారు.

Mock Drills: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్‌ డ్రిల్స్‌
Mock Drills: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్‌ డ్రిల్స్‌

దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్

ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీల్లో దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అలాగే కశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం ఈ డ్రిల్స్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీ తర్వాత జరిగిన సైనిక ఘర్షణల కాలంలో సరిహద్దు రాష్ర్టాలపైనే పాకిస్థాన్‌ వైపు నుంచి కాల్పులు జరిగాయి. కంట్రోల్‌ రూముల నిర్వహణ, వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును మాక్‌ డ్రిల్‌ సందర్భంగా పరీక్షిస్తారు.

Read Also: Trump: స్టీల్ దిగుమతులపై రెట్టింపు సుంకం: ట్రంప్ నిర్ణయం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

📢 For Advertisement Booking: 98481 12870