हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Narcisse: మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో మాత్రం పాములు

Vanipushpa
Narcisse: మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో మాత్రం పాములు

వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా లక్షకుపైగా పాములు! అది కూడా భూమిలోపల ఒక చోట గుంపుగా చేరి.. శీతాకాలం నుంచి రక్షణ పొందుతాయి. చలితో గడ్డకట్టిపోయే సమయంలో ఇవన్నీ మాయమైపోయినట్టే కనిపిస్తాయి. వసంత రుతువు రాగానే వేల సంఖ్యలో బయటకు వస్తూ పర్యాటకులను విస్మయానికి గురిచేస్తూ ఉంటాయి. ఇది సినిమా కాదు.. ప్రకృతి అద్భుతం. ఆ ప్రాంతం కెనడా(Canada)లోని మనిటోబా ప్రావిన్స్‌(Province of Manitoba)లో ఉంది. ఇక్కడి నార్సిస్సే ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్స్‌ డెన్‌గా పిలుస్తారు. ఈ ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఏరియాగా పరిగణిస్తున్నారు.

Read Also: Gold: అమెరికాను అదను చూసి దెబ్బ కొట్టిన చైనా

Narcisse: మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో మాత్రం పాములు
Narcisse: మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో మాత్రం పాములు

నార్సిస్సే స్నేక్‌ డెన్స్‌

చలికాలంలో పాములు మనుగడ సాగించలేవు. ఎందుకంటే వాటి రక్తం చల్లగా ఉంటుంది కనుక. అందుకే అవి చలికాలంలో బ్రూమేషన్‌ అనే ప్రక్రియ పాటిస్తూ.. నిస్తేజంగా ఉంటాయి. కదలికలను బాగా తగ్గించుకుంటాయి. శ్వాస తీసుకునే ప్రక్రియను కూడా తమంతట తాముగా తగ్గించుకుంటాయి. ఇదే క్రమంలో నార్సిస్సేలోని డెన్స్‌.. చలికాలంలో లక్షకుపైగా రెడ్‌ సైడెడ్‌ గార్టర్‌ స్నేక్స్‌కు ఆవాసాలుగా ఉంటాయి. ఇక్కడ పెద్ద ఎత్తున లైమ్‌స్టోన్‌ కొండలు ఉంటాయి. వాటి పగుళ్ల మధ్య, నీరు పారి నున్నగా మారిన గుంతల్లో ఈ పాములు రక్షణ పొందుతూ ఉంటాయి. మళ్లీ వసంతకాలం ప్రారంభం కాగానే బొరియలు, గుంతలు, పుట్టల నుంచి బయటకు వచ్చి తోడు కోసం వెతుక్కుంటాయి. బ్రీడింగ్‌ సీజన్‌ ముగియగానే మళ్లీ చుట్టుపక్కల పచ్చికబయళ్లలోకి వెళ్లిపోతాయి. అక్కడే వేసవికాలం మొత్తం ఉండి.. ఆహారం వేటాడుకుంటూ తిరుగుతుంటాయి. నార్సిస్సే స్నేక్‌ డెన్స్‌.. గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతమైన ఆర్మ్‌స్ట్రాంగ్‌లో ఉంది. ఇక్కడ గడ్డభూములు, అడవులు, వాటి కింద రంథ్రాలతో నిండిన సున్నపురాతి పొరలు ఉంటాయి. బయట మైనస్‌ 30 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ.. ఈ సున్నపురాతి గుహలు, పగుళ్ల మధ్యలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయిలో ఉండవు. అందుకే ఇవి పాములకు సేఫ్‌ వింటర్‌ షెల్టర్‌గా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870