Indian students : పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఇరాన్‌పై జరిగిన సైనిక చర్యల నేపథ్యంలో అక్కడి పరిస్థితులు అనిశ్చితంగా మారాయి. ఈ ప్రభావం ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్ వంటి దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై పడుతోంది.
2025 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో దాదాపు 18.80 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో సుమారు 5 లక్షల మంది పశ్చిమాసియా దేశాల్లోనే ఉన్నట్లు అంచనా. గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ భారతీయ సిలబస్ ఆధారిత పాఠశాలలు, విద్యాసంస్థలు విస్తరించాయి.
Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

దేశాల వారీగా చూస్తే United Arab Emirates లో అత్యధికంగా 2,53,832 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. తరువాత Saudi Arabia (75,830), Kuwait (50,000), Qatar (49,346), Oman (44,847), Bahrain (28,620), అలాగే Israel లో సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మార్చి 2న జరగాల్సిన 10వ, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయుల సంఖ్య దాదాపు 80 లక్షలుగా ఉన్నట్లు అంచనా. తాజా పరిణామాలు అక్కడి భారతీయుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: