వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రంప్ చర్యలను చాలా దేశాలు ఖండిస్తున్నాయి. మదురో, అతడి భార్యను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించారు. డ్రగ్ టెర్రరిజం కుట్ర, ఆయుధాల నేరాలు, కొకైన్ దిగుమతి కుట్ర వంటి ఆరోపణలపై విచారణకు సిద్ధం చేశారు. అయితే మదురోను ఇంత అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవడం యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. అసలేం జరిగిందని ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దేశాధ్యక్షులతో పాటు సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. మదురో చేసిన ఓ డ్యాన్స్ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారడానికి ప్రధాన కారణం అంటున్నారు.
Read Also: Bangladesh: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

‘నో వార్, ఎస్ పీస్’ (No War, Yes Peace)
మదురో అధికారం నుంచి తప్పుకోవాలని… లేదంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం చాలా కాలం నుంచే హెచ్చరిస్తోంది. పైగా యుద్ధం తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చిందని సమాచారం. అయితే మదురో అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా… బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడమే కాక… అమెరికా హెచ్చరికలను హేళన చేస్తున్నట్లుగా… ‘నో వార్, ఎస్ పీస్’ (No War, Yes Peace) పాటకు ట్రంప్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం అమెరికాను రెచ్చగొట్టినట్లుగా మారిందని… ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి మదురో జీవితం తలకిందులు అయిపోయిందని అభిప్రాయపడుతున్నారు.
దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేయాలని, ఆ దేశాన్ని బాంబులతో ధ్వంసం చేయాలని ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. ‘నో వార్, ఎస్ పీస్’ అనే పాట రీమిక్స్‌కు మదురో చేసిన డ్యాన్స్, ట్రంప్‌కు విపరీతమైన కోపం తెప్పించిందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో మదురో ‘నో వార్, ఎస్ పీస్’ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అప్పటికే అమెరికా మదురోకు యుద్ధం తప్పదనే హెచ్చరికలు జారీ చేయడం… మదురో వాటిని ఈ పాట ద్వారా పరోక్షంగా ప్రస్తావించడం ట్రంప్‌కు కోపం తెప్పించిందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: