దక్షిణాఫ్రికాలో తొలిసారిగా జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కూటమి ఉనికి ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
Read Also: Mahavatar Narsimha: హోంబలే యానిమేషన్ మూవీకి అంతర్జాతీయ గుర్తింపు

సమష్టిగా కృషి చేయాలి
ఈ సందర్భంగా జీ-20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హాజరు కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. కొన్ని ప్రాధాన్యాలపై సమష్టిగా కృషి చేయకుంటే జీ-20 ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ విషయాన్ని ప్రపంచ నేతలు గుర్తించాలని సూచించారు. గతంలో కూడా మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముందు, నాటో కూటమి బ్రెయిన్ డెడ్ అయిందంటూ వ్యాఖ్యానించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: