ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఐక్యరాజ్య సమితి (యూఎన్‌జీఏ)లో చేసిన తాజా ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన ప్రసంగంలో ఆయన ముఖ్యంగా పాలస్తీనా దేశం ఏర్పాటుకు వ్యతిరేకంగా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు, యూరోపియన్ యూనియన్ (European Union) నాయకులు ఈ విషయంలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తున్నారని, ఇలా చేయడం అంటే తమ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
OPT student rules : అమెరికాలో OPT/STEM-OPT విద్యార్థులపై ట్రంప్ పరిపాలన సైట్ తనిఖీలు
ఒక పాలస్తీనా దేశం ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారు ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా హమాస్ (Hamas) ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన తమ మిలిటరీ ఆపరేషన్‌ను త్వరలోనే పూర్తి చేస్తానని శపథం చేశారు.బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పశ్చిమ దేశాలు ఇటీవల పాలస్తీనాను దేశంగా గుర్తించిన నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ చర్యలు “యూదులను హత్య చేయడం లాభదాయకం” అనే సందేశాన్ని పంపాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇజ్రాయెల్ (Israel) ఎప్పటికీ తమ గొంతులోకి ఓ ఉగ్రవాద దేశాన్ని నెట్టడానికి అనుమతించదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే తమ దేశం జాతీయ ఆత్మహత్యకు పాల్పడదని, కేవలం మీడియా ఒత్తిడికి, యూదు వ్యతిరేక గుంపులకు భయపడి తమ నిర్ణయాలను మార్చుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
గాజాలో విస్తృత స్థాయిలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది
2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దారుణ దాడికి ప్రతీకారంగా.. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో విస్తృత స్థాయిలో మిలిటరీ ఆపరేషన్ (military operation) చేపట్టింది. ఈ దాడిలో 1,219 మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తర్వాత ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలో ఇప్పటి వరకు 65,549 మందికి పైగా పాలస్తీనియన్లు (వారిలో ఎక్కువ మంది సామాన్య పౌరులే) మరణించినట్లు ఐరాస విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఆయన ప్రసంగం ఐరాసలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది.
నెతన్యాహు ప్రసంగిస్తున్న సమయంలోనే పలు దేశాల ప్రతినిధులు ఆయనకు నిరసనగా వాకౌట్ చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) నుంచి యుద్ధ నేరాల కేసులో అరెస్ట్ వారెంట్ ఎదుర్కొంటున్న నెతన్యాహు.. న్యూయార్క్ వెళ్లడానికి కూడా అసాధారణమైన సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది.

గాజాలో తాము మారణహోమం సృష్టిస్తున్నామన్న ఆరోపణలను బలంగా ఖండించారు
ఆయన బస చేసిన హోటల్ బయట, ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు.నెతన్యాహు తన ప్రసంగంలో గాజా (Gaza) లో తాము మారణహోమం సృష్టిస్తున్నామన్న ఆరోపణలను బలంగా ఖండించారు. అయితే ప్రజలను బలవంతంగా వేరే ప్రాంతానికి పంపించడం కూడా యుద్ధ నేరమే అవుతుందని అంతర్జాతీయ మానవతా చట్టాలు (International humanitarian law) చెబుతాయని పలు సంస్థలు గుర్తుచేశాయి.
ఈ యుద్ధంలో గాజాలోని దాదాపు మొత్తం జనాభా నిరాశ్రయులయ్యారు. ఆయన ప్రసంగం గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్ల ద్వారా కూడా ప్రసారం చేశారని నెతన్యాహు తెలిపారు. తాము హమాస్ నాయకులను, బందీలను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదని ఆయన హీబ్రూ భాషలో పేర్కొన్నారు.తన ప్రసంగంలో నెతన్యాహు మధ్యప్రాచ్యం మ్యాప్‌ను చూపించారు.
దానిపై తమ శత్రువుల పేర్లను కొట్టివేస్తూ.. తమ సైనిక శక్తిని ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌కు సంప్రదాయ మిత్రుడైన ట్రంప్ (Trump) తోనూ ఆయన భేటీ అవుతారని వార్తలు రావడంతో.. తన ప్రసంగంలో నెతన్యాహు ట్రంప్‌ను ప్రశంసించారు. ఈ పరిణామాలన్నింటినీ చూసి పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి అడెల్ అతియెహ్.. నెతన్యాహు ప్రసంగాన్ని “ఓటమి పాలైన మనిషి ప్రసంగం” అని అభివర్ణించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: