పెట్రోలు బంకులు, బేకరీల ముందు పొడవాటి క్యూలు ఉన్నాయి. దేశ రాజధాని నగరాన్ని వదిలి వెళ్లే వారితో రహదారుల మీద కారులు బారులు తీరాయి. చీకటి పడితే చాలు నిస్తేజం, భయం ఆవహిస్తోంది. ఇజ్రాయెల్ హఠాత్తుగా వైమానిక దాడులు చేయడంతో తెహ్రాన్ ప్రజలు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు. నగర ప్రజలు భయం, ఆందోళన, అయోమయం, నిస్సహాయత.. ఇలా రకరకాల భావోద్వేగాల సంఘర్షణలో ఉన్నారు. “మేం రాత్రిళ్లు నిద్ర పోవడం లేదు” అని 21ఏళ్ల మ్యూజిక్ స్టూడెంట్ ఒక ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా యాప్ ద్వారా నాకు చెప్పారు. “అందరూ వెళ్లిపోతున్నారు. నేను వెళ్లడం లేదు. పారిపోవడం కంటే మన ఇంట్లో ఉండి చనిపోవడం గౌరవప్రదం అని మా నాన్న చెప్పారు” అని ఆయన తెలిపారు. దోన్యా, ఆమె అసలు పేరు వెల్లడించడానికి ఇష్టడలేదు.
ఇరాన్ మీద ఏ దేశానికి కూడా శ్రద్ధ లేదు
ఇరాన్(Iran)లో తాను ద్వేషించే ప్రభుత్వానికి, ఇజ్రాయెల్(Israel)కు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న అనేక మంది ఇరానియన్లలో ఆమె కూడా ఒకరు. గాజా(Gaza)లో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని ఆమె ప్రసార మాధ్యమాల ద్వారా చూసివున్నారు. “మా అందమైన తెహ్రాన్ గాజాలా మారడానికి ఎంత మాత్రం ఒప్పుకోను” అని ఆమె అన్నారు. మత బోధకుడి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరగబడాలన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Nethnayhu) పిలుపుపై ఆమె తీవ్రంగా స్పందించారు. “ఇజ్రాయెల్ మమ్మల్ని కాపాడాలని మేము కోరుకోవడం లేదు. ఇరాన్ మీద ఏ దేశానికి కూడా శ్రద్ధ లేదు. అలాగని మేము ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూడా కోరుకోవడం లేదు” అని ఆమె చెప్పారు.

ఇరాన్ సైనిక అధికారులు మరణిస్తున్నారు
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనిక అధికారులు మరణించడం చూసి తనకు చాలా ఉత్సాహంగా అనిపించిందని మరో మహిళ చెప్పారు. అంతటి శక్తిమంతులకి అలా జరుగుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఆమె అన్నారు. “వాళ్లు చాలా శక్తిమంతులు అనే ముద్ర ఒక్కసారిగా చెరిగిపోయింది” అని ఆమె చెప్పారు. “అయితే, రెండో రోజు దాడుల్లో సాధారణ ప్రజలు చనిపోయారని తెలిసినప్పుడు, నాలాంటి వాళ్లు కూడా చనిపోతారని తెలిశాక, కాస్త బాధగా.. భయంగా అనిపించింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల్లో ఇరాన్ 220 మంది పౌరులు చనిపోయారు
జీవితంలో తొలిసారి మరణం గురించి ఆలోచించడం మొదలుపెట్టానని ఆమె చెప్పారు.
శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 220 మంది పౌరులు చనిపోయారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో, ఇరాన్ దాడుల వల్ల తమ దేశంలో 24 మంది చనిపోయారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. జ్రాయెల్ దాడులు ఇరానియన్లలో చీలిక తెచ్చాయని ఆమె అన్నారు. ఇరాన్ పాలకులకు జరిగిన నష్టం చూసి కొంతమంది సంతోషిస్తున్నారని, అలాంటి వారిని చూసి మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె చెప్పారు.
టైటానిక్ నౌక పరిస్థితిలా ఇరాన్ వుంది
“ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితి, టైటానిక్ నౌక మంచు కొండను ఢీ కొట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది” అని ఆమె చెప్పారు. “కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఇది అసలు సమస్యే కాదని చెబుతున్నారు. మరికొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు.” ఇరాన్‌లో మతాధికారుల పాలనను ఆమె ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే నెతన్యాహు తమ దేశానికి చేస్తున్నది మాత్రం “క్షమించరానిదని” ఆమె అన్నారు. “ఈ దాడుల్ని వ్యతిరేకిస్తున్న వారు లేదా సమర్థిస్తున్నవారు, ఎవరైనా కావొచ్చు. చెప్పారు.
ఇరానియన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు
విదేశాల్లో ఉంటున్న ఇరానియన్లు కూడా తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు.
“ప్రస్తుతం ఇరానియన్ల పరిస్థితి ఏంటో చెప్పడం చాలా కష్టం” అని లీడ్స్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త, పరిశోధకురాలు డోర్రేహ్ ఖటిబి హిల్ చెప్పారు. ఆమె ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రభుత్వ వ్యతిరేకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. “ప్రజల్ని వేధిస్తూ, చిత్రహింసలు పెడుతున్న పాలకుల నిస్సహాయత చూసి మీకు సంతోషంగా ఉండవచ్చు. అయితే, దాడుల్లో ప్రజలు చనిపోతున్నారు. ఇది తీవ్రమైన మానవ విపత్తుకు దారితీస్తుంది” అని ఆమె చెప్పారు. అసలేం జరుగుతుందనే దాని గురించి ఇరానియన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Warning : అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్