రష్యా, ఉక్రెయిన్ల (Russia, Ukraine) మధ్య యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఈ రెండు దేశాలమధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ (Trump) రెండోసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత దీనిపై పలుదఫాలుగా చర్యలు జరిపారు. అవన్నీ విఫలం అయ్యాయి. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్(Kim Jung un) ఉన్ రష్యాకే తమ మద్దతు అంటూ పిలుపునిచ్చాడు. తన సాయుధ దళాలను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కోరారు. నిజమైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ప్రతీ యుద్ధంలో
ఇకూడా శత్రువులను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉండాలని సైనికులకు కిమ్ పిలుపునిచ్చారు. అయితే యూనిట్ సైనికులు సముద్రంలోకి గుండ్లు పేల్చుతున్న దృశ్యాలు
తాజాగా కనిపించాయి.

పాశ్చాత్య నిఘావర్గాల సమాచారం ప్రకారం..
కిమ్ ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో కలిసి ఒక పరిశీలన పోస్ట్ నుంచి బైనాక్యులర్ల ద్వారా డ్రిల్న గమనిస్తున్నట్లు ఓ వీడియోలో ఇటీవల కనిపించింది. దక్షిణ కొరియా,
పాశ్చాత్య నిఘా వర్గాల సమాచారం ప్రకారం, గత సంవత్సరం రష్యాలోని కుర్క్స్ ప్రాంతానికి దాదాపు 10,000 మంది ఉత్తరకొరియా సైనికులను ఫిరంగి, క్షిపణులు, దీర్ఘశ్రేణి
రాకెట్ వ్యవస్థలతో మోహరించారు. రష్యా తరుపున పోరాడుతున్నప్పుడు కనీసం 600 మంది ఉత్తరకొరియా సైనికులు మరణించడంతో పాటు వేలాదిమంది గాయపడ్డారు. ఉ
త్తరకొరియా గతంలో రష్యాపట్ల తన విధేయతను వ్యక్తం చేసింది.
బేషరతుగా మద్దతు
ఉక్రెయిన్ సంక్షోభానికి మూలకారణాన్ని పరిష్కరించడంలో రష్యా నాయకత్వం తీసుకున్న అన్ని చర్యలకు బేషరతుగా మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఇంతకు ముందు ఉత్తర కొరియాతో భద్రతా కూటమిని ఏర్పాటు చేయవద్దని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లను హెచ్చరించారు. ఉత్తర కొరియాతో సహా ఎవరికైనా వ్యతిరేకంగా రష్యాతో సహా, పొత్తులను నిర్మించడానికి ఈ సంబంధాలను దుర్వినియోగం చేసుకోవద్దని హెచ్చరించింది.
సంయుక్త వైమానిక విన్యాసాలు
ఉత్తర కొరియా తన అణ్వస్త్ర కార్యక్రమాన్ని విస్తరించడానికి ప్రతీకారంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ తమ సైనిక విన్యాసాలను బలోపేతం చేస్తున్న నేపథ్యంలో లావ్‌రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల మూడు మిత్రదేశాలు కొరియా ద్వీపకల్పం సమీపంలో సంయుక్త వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించాయి. ఇందులో అమెరికా అణ్వస్త్ర సామర్థ్యం గల బాంబర్లు పాల్గొన్నాయి .
ఉత్తర కొరియా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK, ఉత్తర కొరియా అని కూడా పిలుస్తారు) అత్యంత కేంద్రీకృత నిరంకుశ రాజ్యం. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఇది అతిపెద్ద సైన్యాలలో ఒకదానిని నిర్వహిస్తుంది మరియు దాని అక్రమ అణ్వాయుధాలు మరియు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు గణనీయమైన వనరులను కేటాయిస్తుంది.
ఉత్తర కొరియా ధనిక దేశమా లేక పేద దేశమా?
పరిచయం. రాత్రిపూట లైట్ల విశ్లేషణ ద్వారా ఉత్తర కొరియాలో పేదరికంపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఆ దేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా $790 ఉందని మరియు మొత్తం నివాసితులలో 60% మంది సంపూర్ణ పేదరికంలో నివసిస్తున్నారని అంచనా వేయబడింది.
Read hindi news : hindi.vaartha.com