हिन्दी | Epaper

India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన

Sudheer
India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన

జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కొంతకాలంగా ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు

ఇరు దేశాలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు క్షమించదగినవేమీ కాదని, ఈ సమయంలో సంయమనం అత్యంత అవసరమని గుటెరస్ స్పష్టం చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని జరిగే దాడులు ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయమవు అని ఆయన తెలిపారు. ఇరు దేశాలనూ సంయమనం పాటిస్తూ, సైనిక చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. సైనిక మార్గం సమస్యకు పరిష్కారం కాదని, ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు సహజమేనని అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.

ఉద్రిక్తతల పరిస్థితిని దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించేందుకు ఐరాస సిద్ధం

ఈ ఉద్రిక్తతల పరిస్థితిని దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించేందుకు ఐరాస సిద్ధంగా ఉందని గుటెరస్ వెల్లడించారు. శాంతి నెలకొల్పేందుకు అవసరమయ్యే చర్యలకు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి మార్గం కల్పించాలన్నదే ఐరాస లక్ష్యమని, ఈ దిశగా అందరూ చిత్తశుద్ధితో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also : Mega 157 : చిరంజీవి సరసన ‘సరైనోడు’ భామ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870