వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(Kagiso Rabada) చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అత్యంత తక్కువ స్ట్రైక్‌రేట్‌తో 50 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతను జస్‌ప్రీత్ బుమ్రా రికార్డ్‌ను అధిగమించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై 64 మంది బౌలర్లు 50ప్లస్ వికెట్లు తీయగా ఇందులో బుమ్రా, రబడా మాత్రమే 40 కంటే తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశారు. రబడా 38 బంతులకు ఓ వికెట్ తీయగా బుమ్రా 39.9 బంతులకు ఓ వికెట్ పడగొట్టాడు.రబడా తొలి ఇన్నింగ్స్‌లో(5/51)ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు.
స్ట్రైక్ రేట్
ఆస్ట్రేలియాపై అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన బౌలర్లలో కగిసో రబడా(38), జస్‌ప్రీత్ బుమ్రా(39.9) తర్వాత లోహ్‌మన్(42.9), బిల్లీ బార్నెస్(44.8), డేల్ స్టెయిన్(46.2) ఉన్నారు. అలాగే టెస్ట్ క్రికెట్(Test cricket)లో 150కి పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగిన బౌలర్‌గా కూడా రబడా నిలిచాడు. అతను 39.1 బంతులకు ఓ వికెట్ తీసాడు. 100 ప్లస్ వికెట్లు తీసిన బౌలర్లలో రబడా కంటే ముందు లెహ్‌మన్ బెస్ట్ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. 1896లో చివరి మ్యాచ్ ఆడిన అతను 112 వికెట్లు తీసాడు. టెస్ట్‌ల్లో 203 మంది బౌలర్లు 100 ప్లస్ వికెట్లు తీసారు.
టెస్ట్ వికెట్లు
టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రబడా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను అలన్ ఆంథోని డొనాల్డ్(Anthony Donald)ను అధిగమించాడు. డొనాల్డ్ 72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు తీయగా రబడా 71 టెస్ట్‌ల్లో 333 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్(439), షాన్ పొలాక్(421) ఎన్తిని(390) రబడా కంటే ముందున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC final) చరిత్రలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా రబడా నిలిచాడు. గతంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ఈ ఫీట్ సాధించాడు.

తొలి ఇన్నింగ్స్
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా(5/51), మార్కో యాన్సెన్(3/49) రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Australia) తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది. బ్యూ వెబ్‌స్టర్(92 బంతుల్లో 11 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(112 బంతుల్లో 10 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో ఆసీస్‌ను ఆదుకున్నారు.
టెంబా బవుమా
అనంతరం సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లకు 43 పరుగులే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(0), ర్యాన్ రికెల్టన్(16), వియాన్ మల్డర్(6), ట్రిస్టన్ స్టబ్స్(2) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్‌హమ్(8) ఉన్నారు. రెండో రోజు సౌతాఫ్రికా బ్యాటుతో ఏమేర పోరాడుతుందన్నదానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది.
Read Also: Virat Kohli: విరాట్ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐదే తప్పన్న రవి శాస్త్రి