हिन्दी | Epaper

Oil prices: జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

Vanipushpa
Oil prices: జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల (oil prices) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ (Japan) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న భారీ వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserves) మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలు జపాన్ ఈ నిల్వలను ఎలా దాచిపెట్టింది?

Read Also: LPG Crisis: ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

Oil prices: Japan has enough oil stock for six months
Oil prices: Japan has enough oil stock for six months

ఇంధన భద్రత కోసం అత్యవసర చర్యలు

జపాన్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90-95% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ మెజారిటీ చమురు సౌదీ అరేబియా, యూఏఈ వంటి మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. ఈ చమురు అంతా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ అనే ఇరుకైన సముద్ర మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో.. జపాన్ తన ఇంధన భద్రత కోసం అత్యవసర చర్యలు చేపట్టింది. జపాన్ లోని షిబుషి నిల్వ కేంద్రంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలను సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. చమురు నిల్వల విషయంలో చైనా, అమెరికా తర్వాత జపాన్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. జపాన్ వద్ద ప్రస్తుతం సుమారు 440 మిలియన్ బారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ఆ దేశానికి దాదాపు 204 రోజుల పాటు ఎటువంటి దిగుమతులు లేకపోయినా సరిపోతాయి. ఈ నిల్వలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా జాతీయ భద్రతగా జపాన్ భావిస్తుంది. ఎందుకంటే చమురు సరఫరా ఆగిపోతే జపాన్ లోని ఫ్యాక్టరీలు, రవాణా వ్యవస్థ , విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా స్తంభించిపోతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870