ఇటీవల ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణకు ఎవరు ప్రాధేయపడ్డారన్న విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(JaiSankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)గా ఒక సైనిక చర్య అని, కాల్పుల విరమణకు ఎవరు పాకులాడారో సుస్పష్టమని పేర్కొన్నారు.
పాకిస్థాన్ మిలిటరీపై దాడి చేయలేదు
ఈ రోజు ఆయన మాట్లాడుతూ, “కాల్పుల విరమణకు ఎవరు బతిమాలుకున్నారో స్పష్టంగా తెలుస్తోంది” అని అన్నారు. తాము పాకిస్థాన్ మిలిటరీపై దాడి చేయలేదని, కాబట్టి ఆ ఘర్షణలో పాకిస్థాన్ సైన్యానికి జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండే వెసులుబాటు కలిగిందని జైశంకర్ వివరించారు. “మేము పాకిస్థాన్ సైన్యంపై దాడి చేయడం లేదు. కాబట్టి, పాక్ సైన్యానికి ఆ ఘర్షణ నుంచి వైదొలగి, జోక్యం చేసుకోకుండా ఉండే అవకాశం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

పరోక్షమైన సందేశం
ఘర్షణ సమయంలో భారత్ కలిగించిన నష్టం, పాకిస్థాన్ కలిగించిన నష్టం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “మనం ఎంత నష్టం చేశామో, వారు (పాకిస్థాన్) ఎంత తక్కువ నష్టం చేశారో ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి” అని జైశంకర్ తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా, ఆనాటి ఘర్షణల్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిందని, తదనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్థానే కాల్పుల విరమణకు పరిగెత్తుకు వచ్చిందని ఆయన పరోక్షంగా చెప్పారు.
Read Also: Donald Trump : అమెరికా సుంకాల పై భారత్ ఆఫర్ ఇచ్చిందన్న ట్రంప్